'పెద్ది'తో శృతికి కలిసి వచ్చింది ఏంత?
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వచ్చిన 'పెద్ది' సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించిన శృతి హాసన్ అందరి దృష్టిని ఆకర్షించింది.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వచ్చిన 'పెద్ది' సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించిన శృతి హాసన్ అందరి దృష్టిని ఆకర్షించింది. శృతి హాసన్ ఐటెం సాంగ్స్ చేయడం కొత్తేం కాదు, కానీ ఈసారి అంతకు మించి అన్నట్లుగా పెద్ది కోసం శృతి హాసన్ ఐటెం సాంగ్ చేసింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీ వర్గాల్లోనూ పెద్దిలోని శృతి హాసన్ ఐటెం సాంగ్ గురించి చర్చ జరిగిందనే విషయం తెల్సిందే. లిరిక్స్ విషయంలో వివాదం తలెత్తడం, ఆ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు స్పందించడం ఇలా చాలానే శృతి హాసన్ ఐటెం సాంగ్ గురించి జరిగిన విషయం తెల్సిందే. దాంతో పెద్ది సినిమాలోని ఐటెం సాంగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగానే శృతి హాసన్ అందంతో ఆకట్టుకుంటుంది. అలాంటిది ఐటెం సాంగ్‌లో అంటే ఏ స్థాయిలో స్కిన్ షో చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ది ఐటెం సాంగ్‌లో అదే జరిగింది.
శృతి హాసన్ హీరోయిన్‌గా...
శృతి హాసన్ కెరీర్ పరంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తుంది. హీరోయిన్‌గా వరుస సినిమాలు చేసే అవకాశాలు దక్కడం లేదు. పైగా చేసిన ఒకటి రెండు సినిమాలు సైతం పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు కావడంతో శృతి హాసన్ కి ఆఫర్లు తగ్గుతూ వస్తున్నాయి. శృతి హాసన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయింది. దాంతో మెల్ల మెల్లగా ఈమెను ఇండస్ట్రీకి దూరం పెట్టేస్తున్నారు అనే టాక్ సైతం వినిపిస్తోంది. యంగ్ స్టార్ హీరోలు శృతి హాసన్ తో వర్క్ చేయడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే సీనియర్ హీరోల సరసన మరీ చిన్న పిల్ల అన్నట్లు ఉంటుంది అని కొందరు ఈమెను ఎంపిక చేయడం లేదు. ప్రస్తుతం తమిళ్‌లో ఒక సినిమా, తెలుగులో ఒక సినిమాను చేస్తున్నట్లుగా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే తెలుగులో ఈమె చేసే సినిమా లీడ్ రోల్ కాదని సమాచారం అందుతోంది.
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఐటెం సాంగ్..
పెద్ది సినిమా విడుదల తర్వాత ఐటెం సాంగ్ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. దాంతో ముందు ముందు శృతి హాసన్‌కి మరిన్ని ఐటెం సాంగ్ ఆఫర్లు వస్తాయేమో కానీ, హీరోయిన్‌గా మాత్రం ఛాన్స్ రాకపోవచ్చు అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో శృతి హాసన్ ముందు ముందు చేస్తే లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాల్సిందే. లేదంటే ఐటెం సాంగ్స్ చేయాల్సిందే అంటూ కొందరు అంటున్నారు. హీరోలకు జోడీగా కమర్షియల్ హీరోయిన్ పాత్రలకు శృతి హాసన్ ను ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారు అంటే అనుమానమే అన్నట్టుగా చాలా మంది సమాధానం చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో శృతి హాసన్ చెన్నైకి షిప్ట్ అయిన విషయం తెల్సిందే. దాంతో పూర్తిగా తమిళ సినిమాలపై ఈమె దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు మాట్లాడుతున్నారు.
బాలీవుడ్ సినిమాల్లో శృతి హాసన్..
బాలీవుడ్‌లో ఈమె సినిమా వచ్చి చాలా కాలం అయింది. అక్కడ ఎంత ప్రయత్నించినా హీరోయిన్‌గా మాత్రం ఆఫర్ దక్కించుకోలేక పోయిందట. దాదాపు రెండేళ్లు అక్కడ తెలిసిన వారి ద్వారా ప్రయత్నించిందని, అయినా కూడా ఫలితం లేకపోవడంతో చెన్నైకి షిప్ట్ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే శృతి హాసన్ కెరీర్ ఆరంభం నుంచి కూడా ఆఫర్ల కోసం ఎదురు చూడకుండా వచ్చిన ఆఫర్ ను చేసుకుంటూ వచ్చింది. ఇలాంటి పాత్రలే చేస్తాను, ఇలాంటి సినిమా మాత్రమే చేస్తాను అని కండీషన్ పెట్టలేదు. అందుకే ముందు ముందు శృతి హాసన్ తప్పకుండా ఏదో తరహా సినిమాలు, పాత్రలను దక్కించుకుంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ది విడుదలైన తర్వాత శృతికి పెద్దగా కలిసి వచ్చిందేమి లేదని, అయితే ఐటెం సాంగ్ అనగానే శృతి పేరు ముందు వినిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కొందరు అంటున్నారు.