రియల్ ఎస్టేట్‌లో ముంబై పిరమాళ్ మహాలక్ష్మి!

బాలీవుడ్ తారలు న‌టన‌తో పాటు బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌ల ద్వారానే కాకుండా తమ సంపాదను సరైన మార్గంలో మళ్లించి భారీగా లాభాలు గడిస్తున్నారు.

Update: 2026-10-07 17:30 GMT

బాలీవుడ్ తారలు న‌టన‌తో పాటు బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌ల ద్వారానే కాకుండా తమ సంపాదను సరైన మార్గంలో మళ్లించి భారీగా లాభాలు గడిస్తున్నారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం బాలీవుడ్ సెలబ్రిటీలకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇళ్లను, వాణిజ్య ప్రాపర్టీలను కొనుగోలు చేసి, వాటిని భారీ మొత్తాలకు అద్దెకు ఇవ్వడం ద్వారా నెలనెలా కోట్లలో ఆదాయాన్ని పొందుతున్నారు.

ముంబైలోని బాంద్రా, జుహు, వర్లి, మహాలక్ష్మి వంటి ఖరీదైన ప్రాంతాల్లో సెలబ్రిటీల ఇళ్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. బాలీవుడ్ అగ్ర నటులైన అమితాబ్ బచ్చన్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం వంటి తారలు తమ వద్ద ఉన్న అదనపు ప్రాపర్టీలను ప్రముఖ వ్యాపారవేత్తలకు , కార్పొరేట్ దిగ్గజాలకు లీజుకు ఇచ్చి కోట్లాది రూపాయల అద్దెలను సొంతం చేసుకుంటున్నారు. ఇది ఒకవైపు ప్రాపర్టీ విలువ పెరగడానికి, మరోవైపు స్థిరమైన పాసివ్ ఇన్‌కమ్‌కు దోహదపడుతోంది.

ముంబై రియల్ ఎస్టేట్ రంగానికి ఉన్న అపారమైన డిమాండ్ కారణంగానే స్టార్‌డమ్ ఉన్న నటీనటులు తమ వద్ద ఉన్న ఫండ్స్‌ను లగ్జరీ అపార్ట్‌మెంట్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సెలబ్రిటీ హోదా , సెక్యూరిటీ వసతులు ఉండటం వల్ల ఈ ఇళ్లకు సాధారణం కంటే ఎక్కువ ప్రీమియం లభిస్తుంది. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, విదేశీ రాయబారులు కూడా ఇలాంటి హై-ఎండ్ ప్రైమ్ లొకేషన్లలో నివసించడానికి ఎంతటి భారీ అద్దెలనైనా చెల్లించేందుకు వెనుకాడటం లేదు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ -ఆమె తండ్రి, సీనియర్ నటుడు శక్తి కపూర్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపార ముద్రను వేస్తున్నారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో ఒక‌టైన‌ మహాలక్ష్మిలో ఉన్న పిరమాళ్ మహాలక్ష్మి ప్రాజెక్ట్‌లో శ్రద్ధా కపూర్ కుటుంబానికి ఒక లగ్జరీ ఫ్లాట్ ఉంది. దక్షిణ ముంబై విహంగ వీక్షణలు, ప్రపంచస్థాయి సౌకర్యాలు కలిగిన ఈ అపార్ట్‌మెంట్‌పై వారు పెట్టిన పెట్టుబడి ఇప్పుడు భారీ రాబడిని అందిస్తోంది.

తాజాగా శ్రద్ధా కపూర్ కుటుంబానికి చెందిన పిరమాళ్ మహాలక్ష్మి ఫ్లాట్‌ను భారీ మొత్తానికి అద్దెకు ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నెలకు ఏకంగా 2.5 లక్షల అద్దెకు ఒక కార్పొరేట్ రెంటికి లీజుకు ఇచ్చినట్లు సమాచారం. ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఒక ఫ్లాట్‌కు ఈ స్థాయిలో అద్దె లభించడం శ్రద్ధా కపూర్ చేసిన పక్కా రియల్ ఎస్టేట్ ప్లానింగ్‌కు ..ఆ లొకేషన్‌కు ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

Tags:    

Similar News