అందుకే నాని అంటే అంత స్పెషల్!

హీరోగా ఒక రేంజ్ కు వచ్చాక అదే ఇమేజ్‌ ను కంటిన్యూ చేయడం చాలామందికి మస్ట్ అవుతుంది.

Update: 2026-10-07 16:57 GMT

హీరోగా ఒక రేంజ్ కు వచ్చాక అదే ఇమేజ్‌ ను కంటిన్యూ చేయడం చాలామందికి మస్ట్ అవుతుంది. ముఖ్యంగా మాస్ హీరోగా పేరు వస్తే.. ఆ తర్వాత వచ్చే ప్రతి సినిమా అంతకుమించి ఉండాలనే అంచనాలు మొదలవుతాయి. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం ఆ లెక్కలకు పూర్తిగా దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఒకే ఇమేజ్‌ లో ఇరుక్కోకుండా.. ప్రతి సినిమాతో కొత్తగా కనిపించాలన్నదే తన కెరీర్ ప్లాన్ అని ఆయన కామెంట్స్ బట్టి అర్థమవుతుంది.

నాని సినిమాలను అబ్జర్వ్ చేస్తే ఆ విషయం క్లియర్ గా కనిపిస్తుంది. దసరాతో ఊర మాస్ లుక్‌ లో కనిపించిన తర్వాత వెంటనే హాయ్ నాన్న లాంటి సెన్సిటివ్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. మాస్ సినిమా తర్వాత ఫీల్‌ గుడ్ మూవీ చేయడానికి వెనకాడలేదు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని కంటిన్యూ చేయబోతున్నట్లు నాని చెబుతున్నారు. నిజానికి నాని కెరీర్‌ లో ఫస్ట్ నుంచి కూడా ఇదే కనిపిస్తుంది.

స్టోరీలో కొత్తదనం ఉంటే చాలు.. అది మాస్ అయినా, క్లాస్ అయినా, ఫ్యామిలీ ఎమోషన్ అయినా సెలెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. అందుకే నాని ఫిల్మోగ్రఫీలో ఒకదానితో ఒకటి కంపేరిజన్ లేని సినిమాలు ఎక్కువగా కనిపిస్తాయి. మాస్ హీరో అనే ట్యాగ్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి వరుసగా భారీ సినిమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని నాని అభిప్రాయపడుతున్నారు.

ఒకసారి ఆ ఇమేజ్‌ కు అలవాటు పడితే.. తర్వాత కథ ఎంచుకునే విషయంలో కూడా ఎన్నో ఆలోచనలు చేయాల్సి వస్తుందని అంటున్నారు. తనకు మాత్రం అలాంటి లిమిట్స్ వద్దనేది నాని ఆలోచన. అయితే భారీ సినిమాలు చేయకూడదని ఆయన అనుకోవడం లేదు. ది ప్యారడైజ్ కంటే బిక్ రేంజ్ లో, మరింత మాస్‌ గా ఉండే సినిమాలు కూడా చేయడానికి తాను సిద్ధమేనని చెబుతున్నారు. కాకపోతే అది ఒక ఇమేజ్‌ ను కాపాడుకోవడం కోసం కాకుండా.. కథకు అవసరమైతే మాత్రమే చేయాలనేది ఆయన లెక్క.

ఇక్కడే నాని కెరీర్ ప్లాన్‌ లో అసలు విషయం కనిపిస్తోంది. స్టార్‌ డమ్‌ ను నిలబెట్టుకోవడానికి సినిమాలు చేయడం కంటే.. మంచి సినిమాలతో తన ఫిల్మోగ్రఫీని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నారు. సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది, తనను మాస్ హీరోగా పిలిచారా లేదా అనే దానికంటే.. కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తన సినిమాల లిస్ట్ ఎలా ఉందన్నదే ముఖ్యమని భావిస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో 18 ఏళ్ల నుంచి ఉన్న నాని.. తన పొజిషన్ పట్ల సాటిస్ఫికేషన్ తోనే ఉన్నారు.. ఇంకా పెద్ద స్టార్ కావాలని ప్రెజర్ తనపై పెట్టుకోవడం లేదు. తన పొజిషన్ ఒక డ్రీమ్ లాంటిదేనని భావిస్తున్నారు అయితే మాస్ ఇమేజ్ వచ్చినా దానికి పరిమితం కాకుండా.. తనకు నచ్చిన స్టోరీలు చేస్తూ ముందుకు వెళ్లడం నాని ప్లాన్. అదే ఆయనను మిగతా హీరోల నుంచి కాస్త స్పెషల్ గా నిలబెడుతుందనే చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

Tags:    

Similar News