మోక్షు డెబ్యూ.. వశిష్ట మాస్టర్ ప్లాన్ ఇదేనా..

షూటింగ్ పూర్తయ్యే వరకు ఆగకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్యారలెల్ గా నడిపించాలనేది వశిష్ట ప్లాన్‌ గా వినికిడి.

Update: 2026-10-07 11:47 GMT

నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఎప్పుడు మొదలవుతుంది.. ఎలా ఉండబోతుందనే ప్రశ్నలు అభిమానుల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు వాటికి సమాధానంగా డైరెక్టర్ వశిష్ట సరైన ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ తొలి సినిమాను కేవలం డెబ్యూ మూవీగా కాకుండా.. నందమూరి అభిమానులకు గుర్తుండిపోయే సినిమాగా ఆయన స్క్రిప్ట్‌ ను సిద్ధం చేస్తున్నారట.

బింబిసారతో సోషియో ఫాంటసీని తనదైన శైలిలో చూపించిన వశిష్ట.. ఇప్పుడు మోక్షజ్ఞ కోసం కూడా అదే జోనర్‌ ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి మాస్ ఎలిమెంట్స్ కు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారట. మోక్షజ్ఞ బాడీ లాంగ్వేజ్‌ కు తగ్గట్టుగా స్టోరీని డిజైన్ చేసి.. మొదట్లో సరదాగా ఉండే కుర్రాడిగా అతడి రోల్ చూపించనున్నట్లు సమాచారం. కథ ముందుకు వెళ్లే కొద్దీ పాత్రలో వచ్చే ఛేంజెస్ సినిమాకు మెయిన్ స్ట్రెంత్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

సినిమాలో టైమ్ ట్రావెల్, పునర్జన్మ వంటి ఎలిమెంట్స్ కూడా స్టోరీలో కలిపినట్లు తెలుస్తోంది. అంటే నార్మల్ సోషియో ఫాంటసీలా కాకుండా.. మాస్ ఎలిమెంట్స్‌ తో పాటు కొత్త తరహా కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మోక్షజ్ఞకు ఇది తొలి సినిమా కావడంతో అతడిని ఒకే షేడ్‌ లో చూపించకుండా.. యూత్‌ కు కనెక్ట్ అయ్యేలా క్యారెక్టరైజేషన్‌ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక కథలో కీలకమైన సమయంలో బాలయ్య ఎంట్రీ ఇచ్చేలా స్క్రిప్ట్‌ మార్చినట్లు సమాచారం. ముఖ్యంగా సెకండాఫ్‌ లో ఆయన రోల్ స్టోరీ మరో రేంజ్ కు తీసుకెళ్లేలా ఉంటుందట. తండ్రీకొడుకులు ఒకే సినిమాలో కనిపించడమే కాకుండా.. ఒకే ఫ్రేమ్‌ లో కనిపించే సీన్స్ కూడా ఉండేలా వశిష్ట ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే నందమూరి ఫాన్స్ కు ఇది స్పెషల్ ట్రీట్‌ అని చెప్పాలి.

ఇక సినిమా షెడ్యూల్స్ పై వశిష్ట స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. షూటింగ్ మొదలైన తర్వాత లేట్ కాకుండా ముందుగానే మొత్తం ప్లానింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. దసరాకు పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేసి.. 2026 చివర్లో లేదా 2027 స్టార్టింగ్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సోషియో ఫాంటసీ సినిమా కావడంతో గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ పనులకు టైమ్ పడుతుంది.

షూటింగ్ పూర్తయ్యే వరకు ఆగకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్యారలెల్ గా నడిపించాలనేది వశిష్ట ప్లాన్‌ గా వినికిడి. 2027లోనే షూటింగ్ పూర్తి చేసి.. తర్వాత వర్క్స్ వేగంగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. గతంలో మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ ప్రకటించినా.. అది ముందుకు వెళ్లలేదు. దీంతో ఇప్పుడు వశిష్ట చేతిలోకి వచ్చిన మోక్షజ్ఞ డెబ్యూపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే లేట్ అవ్వడంతో.. ఈసారి స్పీడ్‌ గా పూర్తి చేయడంతో పాటు క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ పడకూడదనే ఉద్దేశంతో టీమ్ ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. మరి మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News