వీడియో : వైవా హర్ష అంత పెద్దొడు అయ్యాడా?
వైవా హర్ష గురించి చెబుతున్న సమయంలో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటూ చెప్పడంతో పక్కనే ఉన్న వైవా హర్ష బాబోయ్ నన్ను అంత పెద్ద వాడిని చేయవద్దని సరదాగా అన్నాడు.
యూట్యూబ్ వీడియోస్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుని, టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి స్టార్ కమెడియన్‌గా పేరు దక్కించుకున్న వైవా హర్ష అలియాస్ హర్ష చెముడు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లోని దాదాపు అందరు టాప్ స్టార్స్‌తో కలిసి నటించిన స్టార్ కమెడియన్ వైవా హర్ష అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు బ్రహ్మానందం లేకుండా స్టార్ హీరోల సినిమాలు చేయరు అనేవారు, అలా ఇప్పుడు వైవా హర్ష ప్రతి ఒక్క స్టార్ హీరో, చిన్న హీరోల సినిమాల్లో వైవా హర్ష ఉండాల్సిందే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఒక వైపు సినిమాల్లో కామెడీ రోల్స్ చేస్తూనే మరో వైపు లీడ్ రోల్స్‌తో వెబ్ సిరీస్‌లు, సినిమాలను చేయడం మనం చూస్తున్నాం. తాజాగా వైవా హర్ష ప్రధాన పాత్రలో 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
హర్ష చెముడు ముఖ్య పాత్రలో...
ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ తాజాగా జరిగింది. ఆ ప్రెస్ మీట్‌లో ట్రెండ్డింగ్ యాంకర్ అయిన చార్మిలా చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వైవా హర్ష గురించి చెబుతున్న సమయంలో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటూ చెప్పడంతో పక్కనే ఉన్న వైవా హర్ష బాబోయ్ నన్ను అంత పెద్ద వాడిని చేయవద్దని సరదాగా అన్నాడు. యాంకర్ మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు వైవా సిరీస్‌ను యూట్యూబ్‌లో చూసేదాన్ని, కాలేజ్ డేస్‌లో కలర్ ఫోటో చూశాను అంటూ చెప్పడంతో వైవా హర్ష ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే ఇంత కాలం అయిందా అనిపిస్తుంది. మొన్న మొన్నే ఇండస్ట్రీలో హర్ష అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. ఆయన జర్నీ ఎంతో మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు.
లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్...
స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్‌గా నటించడంతో పాటు, మంచి కథలు వస్తే లీడ్ రోల్స్ చేసేందుకు సైతం ఎప్పుడూ ముందు ఉండే హర్ష చెముడు ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించబోతున్నాడు. వరుస సినిమాలు, సిరీస్‌లతో పాటు, అప్పుడప్పుడు షో ల్లోనూ కనిపించడం ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను తనదైన కామెడీతో అలరిస్తూ వస్తున్నాడు. ఇంతకు ముందు చేసిన వెబ్ సిరీస్‌ల మాదిరిగానే ఈ వెబ్ సిరీస్‌తో హర్ష చెముడు ఆకట్టుకుంటాడనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. స్టార్ హీరోలతో కలిసి నటించడంతో పాటు అప్పుడప్పుడు ఇలా లీడ్ రోల్స్ తో సినిమాలు, సిరీస్‌లు చేయడం ద్వారా నటుడిగా తనను తాను నిరూపించుకునే అవకాశం దక్కుతుంది.
వెబ్ సిరీస్‌తో...
హీరోగానూ వరుస ఆఫర్లు వస్తున్నప్పటికీ హర్ష చెముడు ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఇంతకు ముందు చేసిన సినిమాలు మంచి ఫలితాన్నే ఇచ్చినప్పటికీ వరుసగా హీరోగానే సినిమాలు చేయాలని హర్ష భావించడం లేదు. కమెడియన్స్ కొందరు కాస్త గుర్తింపు రాగానే హీరోగా వరుస సినిమాలు చేస్తూ, కమెడియన్ పాత్రలు వదిలేస్తారు. కానీ హర్ష అలా కాకుండా బ్యాలన్స్ చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు. మరో రెండు మూడు దశాబ్దాల పాటు హర్ష ఇండస్ట్రీలో ఇదే రేంజ్‌తో దూసుకు వెళ్తాడు అనే అభిప్రాయంను ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్‌తో మరోసారి హర్ష ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా అనేది చూడాలి.