రామాయణం : అందులో సగం వచ్చినా అద్భుతమే!
ఇండియన్ సినీ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నితేష్ తివారి 'రామాయణ' సినిమా విడుదలకు మరో నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.
ఇండియన్ సినీ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నితేష్ తివారి 'రామాయణ' సినిమా విడుదలకు మరో నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. సినిమాను రెండు లేదా మూడు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సినిమాను రెండు పార్ట్‌లుగా విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే మొదటి పార్ట్‌కి వచ్చే రెస్పాన్స్ ను బట్టి మూడో పార్ట్ విషయమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు చేయనంత ఖర్చు ఈ సినిమాకు చేశారు, ఇంకా చేయబోతున్నారు. సినిమా పబ్లిసిటీ కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేయడం కోసం చాలా పెద్ద ప్లాన్ వేశారనే వార్తలు వస్తున్నాయి. అత్యధికంగా పబ్లిసిటీ ఖర్చు చేయడం ద్వారా జనాల్లోకి ఈ సినిమా ఎక్కువగా వెళ్తుందనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై ఎవరి అంచనాలు వారివి అన్నట్లుగా ఉన్నాయి.
రామాయణ సినిమాకు రూ.15,000 కోట్ల వసూళ్లు...
ఈ సినిమా గురించి ప్రముఖ సినీ విశ్లేషకు ఆశిష్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాలతో పాటు, దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తోంది. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆశిష్ మిశ్రా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.15,000 కోట్లు వసూళ్లు సాధిస్తుందని విశ్లేషించాడు. ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకు వెళ్లే విధంగా ఈ సినిమా ఉందని, ఇండియన్స్ కథను హాలీవుడ్ ముందు ఉంచే విధంగా నితేష్ తివారీ ఈ సినిమాను రూపొందించడం జరిగిందని ఆయన పేర్కొన్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలో 2026 సంవత్సరం గొప్పదిగా నిలవబోతుందని చెప్పుకొచ్చాడు. ఆయన కేవలం ఒక్క పార్ట్ కి ఏకంగా రూ.15 వేల కోట్లు వసూళ్లు అవుతాయని అంటున్నారు. చాలా ఇండియన్ సినిమాలు కనీసం రూ.150 కోట్లు వసూళ్లు చేయడానికి కిందా మీదా పడుతున్నాయి, రూ.1500 కోట్లు సాధిస్తే గొప్ప విషయంగా చెబుతున్నారు. అలాంటిది రూ.15 వేల కోట్లు అంటే మామూలు విషయం కాదు.
హాలీవుడ్ సినిమాల స్థాయిలో రామాయణ...
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు, కనుక సినిమా అంతకు మించి అన్నట్లుగా వసూళ్లు సాధించడం ఖాయం. అయితే ఆయన చెప్పినట్లుగా రూ.15 వేల కోట్లు అనేది అంత ఈజీ కాదు అని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు సైతం ఆ స్థాయిలో వసూళ్లు చేయడం అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటిది రామాయణ అన్ని పార్ట్‌లు కాకుండా సింగిల్ పార్ట్ అంత వసూళ్లు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు థియేటర్ల వద్ద ఉన్న పరిస్థితులు ఆశాజనకంగా లేవు. అందుకే భారీ ఎత్తున వసూళ్లు అనేవి సాధ్యం కాకపోవచ్చు. కానీ ఈ విశ్లేషణ చేసింది ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన సుదీర్ఘ కాలంగా సినీపోలిస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. అలాంటి వ్యక్తి విశ్లేషణ కచ్చితంగా నిజం అవుతుందని చాలా మంది అంటున్నారు.
రణబీర్ కపూర్, సాయి పల్లవి...
ఒకవేళ ఆశిష్ మిశ్రా విశ్లేషించినట్లుగా రూ.15 వేల కోట్లు కాకున్నా అందులో సగం దాదాపుగా ఏడున్నర వేల కోట్ల వసూళ్లు నమోదు అయినా అద్భుతం అనడంలో సందేహం లేదు. ఒక సినిమా ఈ మద్య కాలంలో వెయ్యి కోట్ల సాధించింది అంటే గొప్ప విషయం. అలాంటిది రెండు మూడు వేల కోట్లు సినిమా వసూళ్లు రాబట్టింది అంటే అద్భుతం అనుకోవాల్సిందే. సినిమాకు ఎంత పెట్టినా కొన్ని సినిమాలు పెట్టిన మొత్తంను రాబట్టలేక పోతున్నాయి. బడ్జెట్ అనుసారంగా వసూళ్లు ఉంటాయి అనేది ఇప్పుడు కనిపించడం లేదు. కంటెంట్ అనుసారంగానే సినిమా వసూళ్లు ఉంటున్నాయి. కనుక ఇప్పుడే పూర్తి స్థాయిలో విశ్లేషించడం సరికాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాముడిగా రణబీర్ కపూర్, సాయి పల్లవిని సీతగా చూపించిన ఈ సినిమాలో యశ్ ను రావణాసురుడిగా చూపించబోతున్నారు. సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్ కారణంగా కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అవుతాయని అంతా నమ్ముతున్నారు. అయితే సినిమా విడుదల తర్వాత ఏ మేరకు వసూళ్లు రాబడుతుంది అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.