త్రివిక్రమ్ ప్లానింగ్.. తారక్ ఫ్యాన్స్ నమ్మాలంటే..
అసలు తారక్ తో చేయబోయే సినిమా విషయంలో త్రివిక్రమ్ అడ్వాన్స్డ్ గానే ఆలోచిస్తున్నారనే టాక్ ఉంది. సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంతో కథను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం ఉంది.
ఒకవైపు విక్టరీ వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం.. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ భారీ మైథాలజీ మూవీ. త్రివిక్రమ్ లైనప్ లో ఆ రెండు సినిమాల కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే తారక్ ఫ్యాన్స్ ఈసారి డైలాగ్స్ కాదు.. త్రివిక్రమ్ ప్లానింగ్ స్క్రీన్ పై కనిపించాలనే కోరుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే త్రివిక్రమ్ అంటే డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఆయన ఆ ఇమేజ్ ను దాటి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో భారీ స్థాయిలో తెరకెక్కనుందనే ప్రచారం ఇప్పటికే అంచనాలు పెంచుతోంది. ఇక్కడే తారక్ ఫ్యాన్స్ లో చిన్న టెన్షన్ మొదలైంది. ఎందుకంటే భారీ మైథాలజీ సినిమా అంటే నార్మల్ కమర్షియల్ మూవీలా కాదు. స్టోరీతో పాటు విజువల్స్, వీఎఫ్ఎక్స్, యాక్షన్, ఆర్ట్ వర్క్, షూటింగ్ ప్లాన్.. ఇలా ప్రతి విషయంలోనూ చాలా పక్కాగా ఉండాలి. త్రివిక్రమ్ ఇప్పటివరకు తనకు బాగా తెలిసిన ఫ్యామిలీ, కమర్షియల్ జోనర్ లోనే ఎక్కువగా సినిమాలు చేశారు.
ఇప్పుడు ఒక్కసారిగా భారీ మైథాలజీ వైపు వెళ్లడం పెద్ద ఛాలెంజ్ గానే కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతం ఆదర్శ కుటుంబం సినిమాపై కూడా హైప్ పెరిగింది. ఆ సినిమాకు సంబంధించి రీషూట్లు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రీషూట్లు అనేవి సినిమా బాగా రావడం కోసం మేకర్స్ తీసుకునే నిర్ణయం కూడా కావచ్చు. చివరికి స్క్రీన్ పై కంటెంట్ ఎలా వచ్చిందన్నదే అసలు విషయం. అక్కడ త్రివిక్రమ్ తన మార్క్ చూపిస్తే.. తారక్ సినిమాపై ఉన్న చిన్న చిన్న డౌట్స్ క్లియర్ అవుతాయి.
అసలు తారక్ తో చేయబోయే సినిమా విషయంలో త్రివిక్రమ్ అడ్వాన్స్డ్ గానే ఆలోచిస్తున్నారనే టాక్ ఉంది. సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంతో కథను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం ఉంది. పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమాను తీసుకెళ్లాలంటే స్కేల్ మాత్రమే కాదు.. స్టోరీని అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడం కూడా చాలా ముఖ్యం. ఇక త్రివిక్రమ్ ప్లానింగ్ కేవలం ఒక్క హీరో దగ్గర ఆగిపోవడం లేదు.
నాని, వెంకటేశ్ వంటి హీరోలతో మల్టీస్టారర్ ఆలోచనలు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంటే ఒక సినిమా పూర్తయ్యే వరకు తర్వాతి సినిమా గురించి ఆలోచించే దర్శకుడి కంటే.. చాలా ముందుగానే తన జర్నీని ప్లాన్ చేసుకునే దర్శకుడిగా త్రివిక్రమ్ కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్లానింగ్ కు అసలు టెస్ట్ తారక్ సినిమానే. ఎందుకంటే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా త్రివిక్రమ్ కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టుగా మారే అవకాశం ఉంది.
ఇప్పటివరకు ఉన్న ఇమేజ్ ను పక్కనపెట్టి కొత్త వరల్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ముందుగా ఆదర్శ కుటుంబంతో త్రివిక్రమ్ తన కంటెంట్ పై మళ్లీ నమ్మకం పెంచాలి. ఆ తర్వాత మైథాలజీ మూవీ విషయంలో అంచనాలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఆదర్శ కుటుంబం హిట్ అయితే తారక్ ఫ్యాన్స్ లో ఉన్న టెన్షన్ తగ్గుతుంది. ఆ తర్వాత త్రివిక్రమ్- తారక్ కాంబినేషన్ కోసం వెయిటింగ్ మరింత పెరగడం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి.