రెండింటా ఆ ర‌కంగా వాళ్లిద్ద‌రికే సాధ్య‌మా!

స్టార్ హీరోల‌కు జోడీగా న‌టిస్తూ సోలోగా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాట‌డం ఆషామాషీ కాదు. హీరోయిన్ గా వ‌చ్చిన గుర్తింపును ఉమెన్ సెంట్రిక్ చిత్రాల‌తో కొన‌సాగించ‌డం అన్న‌ది స‌క్సెస్ మీద‌నే ఆధార‌ప‌డి ఉంటుంది.;

Update: 2025-08-21 09:30 GMT

స్టార్ హీరోల‌కు జోడీగా న‌టిస్తూ సోలోగా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాట‌డం ఆషామాషీ కాదు. హీరోయిన్ గా వ‌చ్చిన గుర్తింపును ఉమెన్ సెంట్రిక్ చిత్రాల‌తో కొన‌సాగించ‌డం అన్న‌ది స‌క్సెస్ మీద‌నే ఆధార‌ప‌డి ఉంటుంది. సోలో నాయిక‌గా న‌టించే క్ర‌మంలో ఎక్క‌డ తేడాలు జ‌రిగినా? హీరోయిన్ అవ‌కాశాల‌కే ఎస‌రొ స్తుంది. వైఫ‌ల్యం అన్న‌ది ఎలాంటి ప‌రిస్థితుల‌కైనా దారి తీస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందు కెళ్ల‌డం అన్న‌ది అంద‌రికీ సాధ్యం కాదు. రాణీ ముఖ‌ర్జీ, క‌రీనాక‌పూర్, విద్యాబాల‌న్ లాంటి భామ‌లు అలా విఫ‌ల‌మైన వారే.

సీనియ‌ర్ల‌ను మించి:

రాణీ ముఖ‌ర్జీ కొంత కాలంగా లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తోనే స‌రిపెట్టుకుంటున్నారు. క‌రీనా కూడా ఈ త‌ర‌హా అటెంప్ట్ లు చేసింది గానీ అనుకున్నంత‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు. దీంతో హీరోయిన్ పాత్ర‌ల‌కే ప‌రిమి తైంది. విద్యాబాల‌న్ కూడా ప్ర‌య‌త్నించి విఫ‌లమైంది. దీపికా ప‌దుకొణే కూడా ట్రై చేసింది. 'ప‌ద్మావ‌త్' తో స‌క్సస్ అందుకున్నా? అటుపై లేడీ ఓరియేంటెడ్ ప్ర‌య‌త్నాలు చేయాలంటే తాను కూడా ఆలోచిస్తుంది. ఈ ర‌కంగా బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో రాణిస్తుంది ఎంత మందంటే ఇద్ద‌రు భామ‌ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

ఊహించ‌ని విజ‌య‌మ‌ది:

వాళ్లే శ్ర‌ద్దా క‌పూర్, అలియాభ‌ట్. ప్ర‌స్తుతం ఈ భామ‌లిద్ద‌రు క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల్లో స్టార్ హీరోల‌కు జోడీగా న‌టిస్తూనే బాక్సాఫీస్ వ‌ద్ద సోలో నాయి క‌ల‌గాను స‌త్తా చాటుతున్నారు. 'స్త్రీ'తో ఉమెన్ సెంట్రిక్ ఫార్మెట్ లోకి అడుగు పెట్టిన శ్ర‌ద్దా క‌పూర్ ఆ సినిమా విజ‌యం అనంత‌రం 'స్త్రీ-2' తో మ‌రోసారి బ్లాస్ట్ అయింది. ఈ సినిమా ఏకంగా 800 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. శ్ర‌ద్దా క‌పూర్ ఏమాత్రం ఊహించ‌ని సక్సెస్ ఇది. ఈ రెండు సినిమాల మ‌ధ్య లో ఎన్నో క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేసింది. అలా రెండు ర‌కాల చిత్రాల‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ వ‌చ్చింది.

తొలి స్పై చిత్రంలో:

తాజాగా జానప‌ద ప్ర‌పంచంలో త‌న‌దైన ముద్ర వేసిన మీఠాబాయి బావు మంగ్ నారాయ‌ణ్ గావ్ క‌ర్ బ‌యో పిక్ లో న‌టించ‌డానికి రెడీ అవుతోంది. ఇందులో క‌పూర్ బ్యూటీ విఠాబాయి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇదే స్పూర్తితో అలియాభ‌ట్ కూడా ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తుంది. 'గుంగూబాయి క‌తియా వాడి'తో ఉమెన్ సెంట్రిక్ వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెట్టిన అలియా స్టార్ హీరోల‌తో ప‌ని చేస్తూనే అరుదుగా సోలోగానూ స‌త్తా చాటుతోంది. ప్ర‌స్తుతం వైఆర్ ఎఫ్ స్పై యూనివ‌ర్శ్ నుంచి రిలీజ్ అవుతోన్న 'ఆల్పా'లో న‌టిస్తోంది. వైఆర్ ఎఫ్ నుంచి రిలీజ్ అవుతోన్న తొలి లేడీ స్పై చిత్రం కావ‌డం విశేషం. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌కు అలియాభ‌ట్ ను ఏరి కోరి మ‌రీ తీసుకున్నారు. గంగూబాయి త‌ర్వాత స్టార్స్ కి జోడీగా న‌టిస్తూనే క‌థాబ‌లమున్న చిత్రాల‌తో సోలోగానూ మెరుస్తోంది.

Tags:    

Similar News