ఆన్ లొకేషన్ శోభిత వంట.. రుచి చూస్తానన్న చైతూ
అంతేకాదు.. తాను వండిన వంటకాలు అదిరిపోయాయి అనే సిగ్నల్ ఇస్తూ, అలా గరిటె తిప్పుతూ నోరూరిస్తోంది. ఎవరైనా తన వంటకాల్ని కామెంట్ చేస్తే, వెంటనే కొబ్బరికాయతో ఒకటిస్తానంటూ వార్నింగ్ కూడా ఇస్తోంది.;
వన భోజనాలకు వెళ్లే సీజన్ కాదు ఇది.. అయితే స్టార్లకు ఔట్ డోర్ వెళితే ప్రతిరోజూ వనభోజనాలకు వెళ్లినట్టే. ప్రకృతి రమణీయత నడుమ చెట్టు చేమ నీడలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వండుకు తినే భాగ్యం కలుగుతుంది. నిజానికి సెట్లో అందరికీ ప్రొడక్షన్ టీమ్ వండి పెడుతుంది. కానీ ఇక్కడ ఓపెన్ టెంట్ లో వంటపై ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైంది శోభిత ధూళిపాల. అక్కినేని కోడలు సాహసం చేయరా డింబకా..! అంటూ వంట కోసం నడుం బిగించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అన్నట్టు ఆన్ లొకేషన్ ప్రొడక్షన్ టీమ్ నుంచి హైజాక్ చేసిన గ్యాస్ సిలిండర్, వంట సెటప్ చూస్తుంటే, అన్ని వసతులు లేకపోయినా ఆరుబయట లొకేషన్ లో ఎంతో ఎంజాయ్ చేస్తూ శోభిత వంట చేస్తుండడం చూపరులను అమితంగా ఆకర్షించింది.
అంతేకాదు.. తాను వండిన వంటకాలు అదిరిపోయాయి అనే సిగ్నల్ ఇస్తూ, అలా గరిటె తిప్పుతూ నోరూరిస్తోంది. ఎవరైనా తన వంటకాల్ని కామెంట్ చేస్తే, వెంటనే కొబ్బరికాయతో ఒకటిస్తానంటూ వార్నింగ్ కూడా ఇస్తోంది. కోడలు పిల్లా మజాకానా! అక్కినేని ఇంటికి ఎంతటి అదృష్టం. ఇంత మంచి వంటను నోరారా ఆరగించే అదృష్టం అందరికీ దక్కదు. అదంతా సరే కానీ, నోరూరించే రుచికరమైన వంటకాలను రెడీ చేసిన భార్యను చైతూ ఎలా టీజ్ చేసాడో తెలుసా?
``ఈ వంటను రుచి చూడటానికి వేచి చూస్తున్నాను!` అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు చై. నిజంగానే పప్పు సాంబార్ రుచికరంగా రెడీ చేయడానికి అవసరమైన వంట సామాగ్రిని రెడీ చేస్తున్న శోభితను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. కూరగాయలను ముక్కలుగా తరుగుతున్న ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే వెనక్కి తిరిగి అలా ఆ కొబ్బరికాయను చూపిస్తూ, విసిరి కొడతానని ఎవరికి వార్నింగ్ ఇచ్చిందో అర్థం కావడం లేదు. అన్నట్టు మసాలా దినుసులు రుబ్బడానికి రోకలి, మోర్టార్ వగైరా తీసుకుని రావడం కూడా ఎగ్జయిట్ చేసింది.
నిజానికి మా ఇద్దరికీ వంట రాదు! అని ఇంతకుముందు వోగ్ ఇంటర్వ్యూలో అంగీకరించారు చై-శోభిత జంట. కానీ ఇప్పుడు శోభిత మారినట్టే కనిపిస్తోంది. కనీస వంటను అయినా వండి తన హబ్బీకి రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నట్టే ఉంది. ప్రతిరోజూ రాత్రిపూట హాట్ చాక్లెట్ తయారు చేసుకుని తింటే సరిపోదు. చాక్లెట్లు తయారీ లేదా కాఫీ టీ కలపడం వంటివి వంట కిందికి రావని చైతూ చెప్పకనే చెప్పాడు. అందుకే పట్టుదలగా ఇప్పుడు వంటలు వండటం నేర్చుకున్నట్టే కనిపిస్తోంది. చైతన్య - సమంత రూత్ ప్రభు 2017లో వివాహం చేసుకున్నారు. 2021లో విడాకులు తీసుకున్నారు. 2022లో చై-సామ్ డేట్ మొదలైందని కథనాలొచ్చాయి. అదే ఏడాది చివరిలో పెళ్లితో ఒకటయ్యారు. సమంత ప్రస్తుతం `ఫ్యామిలీమ్యాన్` దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికార్ చేస్తున్నాయి.