రామూయిజానికి ఫాలోవ‌ర్ అక్కినేని కోడ‌లు

శోభిత త‌న‌కు ఇష్ట‌మైన చాలా విష‌యాల‌ను ట‌చ్ చేస్తూనే, పాడ్ కాస్ట్ ల‌లో త‌న‌కు న‌చ్చిన ఒక పాడ్ కాస్ట్ గురించి ప్ర‌స్థావించింది.;

Update: 2025-12-06 13:30 GMT

ఫిల్ట‌ర్‌లెస్ గా రా అండ్ ర‌స్టిక్ గా మాట్లాడ‌గ‌ల‌గ‌డం ఒక ఆర్ట్. అది అంద‌రికీ సాధ్య‌ప‌డ‌దు. స‌మాజం, సామాజిక బంధ‌నాల న‌డుమ ఎవ‌రు ఏమ‌నుకుంటారోన‌నే భ‌యం ఒక‌వైపు మేధావుల‌ను కూడా మాట్లాడ‌నీయ‌వు. ప్ర‌తిదానికి ఆచితూచి ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి రొటీనిటీకి పూర్తి వ్య‌తిరేకి రామ్ గోపాల్ వ‌ర్మ‌. అత‌డి కంటూ ఒక భావ‌జాలం ఉంది. దానిని మాత్ర‌మే అత‌డు అనుస‌రిస్తాడు. దీనిని `రామూయిజం` అని శిష్యులు చెప్పుకుంటారు. అందుకే రామూ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ప్ర‌త్యేకించి ఫాలోవ‌ర్స్ ఉన్నారు. బాబాలు, స్వామీజీల‌కు ఉన్న‌ట్టే రామూయిజాన్ని ఫాలో అయ్యే భ‌క్త‌జ‌నం త‌మ గురువును నిబ‌ద్ధ‌త‌తో అనుస‌రిస్తారు.

అయితే ఈ జాబితాలో తాను కూడా ఉన్నాన‌ని చెబుతున్నారు శోభిత ధూళిపాల‌. యాథృచ్ఛికంగా `శివ‌` సినిమాతో క‌నెక్ష‌న్ ఉన్న నాగార్జున‌కు స్వ‌యానా కోడ‌లు పిల్ల గ‌నుక‌, రామూని ఇంత‌గా అభిమానిస్తుందా? అని సందేహించ‌వ‌చ్చు. కానీ ఒక వ్య‌క్తి ఒక‌రికి న‌చ్చారు అన‌డానికి, అత‌డి భావ‌జాలం కూడా ఒక కార‌ణం కావొచ్చు. బ‌హుశా రామూజీలో నిజాయితీ, వ‌డ‌క‌ట్ట‌ని మాట తీరుకు శోభిత‌ క‌నెక్ట్ అయి ఉండొచ్చు.

శోభిత త‌న‌కు ఇష్ట‌మైన చాలా విష‌యాల‌ను ట‌చ్ చేస్తూనే, పాడ్ కాస్ట్ ల‌లో త‌న‌కు న‌చ్చిన ఒక పాడ్ కాస్ట్ గురించి ప్ర‌స్థావించింది. `ది డైరీ ఆఫ్ ఏ సిఇఓ` తాను మెచ్చే మొద‌టిది. తరువాత రామ్ గోపాల్ వర్మ రాసిన `రాముయిజం`ని అమితంగా ఇష్ట‌ప‌డ‌తాన‌ని శోభిత‌ చెప్పింది. ఫిల్టర్ లెస్ గా, రాగా.. అనూహ్యంగా రామూయిజం ప్ర‌త్యేక‌త‌తో కూడుకున్న‌ద‌ని శోభిత అన్నారు. ఆర్జీవీ ప్రతిదాని గురించి మాట్లాడుతాడు. సంప్రదాయాలు, వాస్తవాలు, ప్రస్తుత సంఘటనలు, ప్రేమ, కామం, మొబైల్ వ్యసనం, సినీ పరిశ్రమ స‌హా చాలా అంశాల‌పై నిజాయితీగా మాట్లాడుతాడు. అందుకే రామూయిజంపై గురి కుదిరింది. మూడవది `ది బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్` త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన‌ది.

ఇక శోభిత కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, తమిళ చిత్రం `వెట్టువం`లో ప్ర‌స్తుతం నటిస్తోంది. ప‌లు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. తనకు ఇష్టమైన పాటలు, పాడ్‌కాస్ట్ అబ్సెషన్స్ గురించి కూడా శోభిత‌ మాట్లాడుతోంది. గూఢ‌చారి, మేజ‌ర్ సినిమాల‌లో త‌న పాత్ర‌ల‌తో క‌ట్టి ప‌డేసిన శోభిత‌, ది నైట్ మేనేజ‌ర్ వెబ్ సిరీస్ లో అత్యుత్త‌మ న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌తో ర‌క్తి క‌ట్టించింది. `మంకీ మేన్` అనే హాలీవుడ్ చిత్రంలోను శోభిత న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిసాయి. శోభిత ప్ర‌తి ఎంపికా ప్ర‌త్యేక‌త‌తో కూడుకున్న‌ది. అందుకే త‌న‌ను న‌టిగా ఇంకా ఇంకా చూడాల‌ని అభిమానులు ఆరాట‌ప‌డ‌తారు.

Tags:    

Similar News