చరణ్ పై శివన్న ప్రేమ.. పవన్ కళ్యాణ్ లో కనిపించిన తమ్ముడు

ఆ రియల్ ఎమోషన్స్ ను స్క్రీన్ పై చూసినప్పుడు శివరాజ్ కుమార్ కు ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయట.

Update: 2026-05-25 16:40 GMT

సినీ ఇండస్ట్రీలో స్టార్ల మధ్య ఉండే బంధాలు కొన్నిసార్లు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. లేటెస్ట్ గా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, రామ్ చరణ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ది సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఈ స్టార్స్ ఒకరి గురించి ఒకరు చాలా ప్రేమగా కొన్ని విషయాలను బయటపెట్టారు. కన్నడలో పెద్ది ఈవెంట్ ను నిర్వహించారు.

ఇక గతంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పక్కపక్కనే కూర్చున్నప్పుడు వారిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన తనను ఎంతగానో కదిలించిందని శివన్న గుర్తుచేసుకున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ తన అన్న కొడుకైన రామ్ చరణ్ ను చూసుకున్న విధానం, ఆయన చూపించిన ఆప్యాయత చూశాక తనకు తన సొంత తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ గుర్తుకొచ్చాడని ఎమోషనల్ అయ్యారు.

తాను తన తమ్ముడు అప్పును ఎంత ప్రేమగా చూసుకునేవాడో, పవన్ కళ్యాణ్ లో కూడా చరణ్ పట్ల సరిగ్గా అదే రకమైన కేరింగ్ కనిపించిందని ఆయన వెల్లడించారు. కన్నడ ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్, పునీత్ ల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ్ముడిని కొడుకులా చూసుకునే తత్వం శివన్నది. మెగా ఫ్యామిలీలో కూడా పవన్ కళ్యాణ్ కు చరణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. బాబాయ్ పక్కన ఉన్నప్పుడు చరణ్ లో కనిపించే ఆ ఏమోషన్, చరణ్ ను పవన్ గైడ్ చేసే విధానం చాలా నాచురల్ గా ఉంటాయి.

ఆ రియల్ ఎమోషన్స్ ను స్క్రీన్ పై చూసినప్పుడు శివరాజ్ కుమార్ కు ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయట. రామ్ చరణ్ అంటే తనకు చెప్పలేనంత ప్రేమ అని, ఆయన వర్కింగ్ స్టైల్ వ్యక్తిత్వం తనకు బాగా నచ్చుతాయని శివన్న చెప్పారు. చరణ్ తో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఒక మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని కొనియాడారు. కేవలం ఒక తోటి నటుడిగా కాకుండా, తన ఇంట్లోని తమ్ముడిలాగే చరణ్ ను చూసుకుంటానని ఆయన చెప్పిన మాటలు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. సినిమా ప్రచారంలో భాగంగా జరిగిన ఈ ఈవెంట్ లో శివన్న మాట్లాడిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఒక పక్కా కమర్షియల్ ప్రమోషన్స్ మధ్యలో ఇలాంటి ఒక జెన్యూన్ ఎమోషనల్ టచ్ దొరకడం సినిమాకు కూడా ఒక పాజిటివ్ బజ్ ను తీసుకొచ్చింది.

స్టార్ల మధ్య ఉండే ఇలాంటి ఆర్గానిక్ బాండింగ్స్ చూసినప్పుడు అభిమానుల్లో కూడా ఒక మంచి వైబ్ క్రియేట్ అవుతుంది. అనవసరమైన గొడవలు, ఇగోలు పక్కనపెట్టి ఒకరినొకరు గౌరవించుకునే ఇలాంటి సంస్కృతి ఇండస్ట్రీకి ఎంతో అవసరం. శివరాజ్ కుమార్ లాంటి ఒక సీనియర్ నటుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ల అనుబంధాన్ని అంతలా ఓన్ చేసుకోవడం నిజంగా ఒక రేర్ మూమెంట్. ఇక సినిమాలో శివన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. కన్నడలో కూడా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Tags:    

Similar News