నో చీటింగ్.. 21 ఏళ్ల ఏజ్ లో శివాత్మిక ఎలా ఉందంటే?

కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది అమ్మడు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ లో టచ్ లో ఉంటూ సందడి చేస్తుంటోంది.;

Update: 2025-07-29 11:17 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తెలిద్దరూ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. శివాత్మిక, శివానీలు.. ఇప్పటికే హీరోయిన్స్ గా తెరంగేట్రం చేశారు. దొరసాని సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన శివాత్మిక.. డెబ్యూతో మంచి ప్రశంసలు అందుకుందనే చెప్పాలి. విమర్శకులు కూడా పొగడ్తలు కురిపించారు.


ఆ సినిమాకు గాను సైమా ఉత్తమ నూతన నటి అవార్డు కూడా గెలుచుకున్న శివాత్మిక.. డెబ్యూతో అనుకున్న రేంజ్ లో హిట్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. ఆ తర్వాత కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. అక్కడ పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆనందం విలయదుం వీడు, నితమ్ ఒరు వానం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కానీ అనుకున్నంత గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. తెలుగులో బ్రహ్మానందం లీడ్ రోల్ లో నటించిన పంచతంత్రం, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగ మార్తాండ సినిమాల్లో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మూవీస్ కు గ్యాప్ ఇచ్చినట్లు ఉంది. రెండేళ్లలో ఆమె నటించిన ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు.

కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది అమ్మడు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ లో టచ్ లో ఉంటూ సందడి చేస్తుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పోస్టులు పెడుతూ ఉండే శివాత్మిక.. తాజాగా పెట్టిన క్రేజీ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులను, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

కొద్ది రోజులుగా ఇన్ స్టాగ్రామ్ లో చీట్ చేయకుండా 21 ఏళ్ల వయసులో ఎలా ఉన్నారో పిక్స్ పోస్ట్ చేసే విషయం ట్రెండ్ గా మారిన సంగతి విదితమే. చాలా మంది యూజర్స్.. తమ పిక్స్ ను పోస్ట్ చేస్తున్నారు. ఆ ట్రెండ్ నే ఇప్పుడు శివాత్మిక కూడా ఫాలో అయ్యి రెండు పిక్స్ పోస్ట్ చేసింది. అందులో ఒక పిక్ లో పింక్ చీరలో ట్రెడిషనల్ గా కనిపించింది.

మరో ఫొటోలో గాగ్రా చోలీలో ఉన్న శివాత్మిక.. తన నిజాయతీ ప్రదర్శించిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా అప్పుడు పిక్స్ ను నిజాయతీగా షేర్ చేసిందని చెబుతున్నారు. ఫొటోస్ సూపర్ అని అంటున్నారు. కాగా, తన కొత్త సినిమాను అమ్మడు ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News