వైష్ణవి నడుము గిల్లే సీన్.. షాక్ అయ్యా: శివ నిర్వాణ కామెంట్స్!
ఇటీవల ‘ఇరుముడి’తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టిన దర్శకుడు శివ నిర్వాణ తాజాగా ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ లాంచ్ వేడుకకు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.
ఇటీవల ‘ఇరుముడి’తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టిన దర్శకుడు శివ నిర్వాణ తాజాగా ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ లాంచ్ వేడుకకు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన, బేబీ కాంబో రిపీట్ అవ్వడం వెనుక ఉన్న క్యూరియాసిటీతో పాటు హీరోయిన్ వైష్ణవితో తనకున్న పాత వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచాయి.
ముఖ్యంగా వైష్ణవి గురించి మాట్లాడుతూ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ‘టక్ జగదీష్’ టైమ్‌లో వైష్ణవి ఒక చిన్న క్యారెక్టర్ చేసిందని, ఆ సమయంలో సీన్‌లో ఒక రౌడీ వచ్చి నడుము పించ్ చేసే బిట్ ఉందని చెప్పారు. అయితే ‘నేను అన్‌కంఫర్టబుల్ అండీ, ఆ సీన్ చేయలేను’ అని ఆమె ముందే మొహమాటం లేకుండా రిఫ్యూజ్ చేసిందట. ‘ఇది క్యారెక్టర్ వైషూ, నిన్ను కాదు పించ్ చేసేది క్యారెక్టర్‌ని’ అని తాను అప్పట్లో నచ్చజెప్పానని అన్నారు.
తీరా ఆ తర్వాత ‘బేబీ’ సినిమా చూసి తాను షాక్ అయ్యానని, క్యారెక్టర్ కోసం ఏకంగా ఆ లెవెల్ కన్విక్షన్‌తో పెర్ఫార్మ్ చేసి మెప్పించిందని ప్రశంసించారు. ఈ మధ్య వచ్చిన ప్రేమకథల్లో ‘బేబీ’ తనను అమితంగా కదిలించిన చిత్రాల్లో ఒకటని శివ నిర్వాణ చెప్పారు. సడన్‌గా సితార నుంచి ఆనంద్, వైష్ణవి మళ్లీ కలిసి నటిస్తున్నారని అనౌన్స్‌మెంట్ రాగానే.. ‘బేబీని మించి ఏం చేస్తారు వీళ్లు’ అనే ఆలోచన తనకు కూడా వచ్చిందన్నారు.
తీరా ట్రైలర్ చూశాక ఆ భయాలు పోయాయని, అసలు బేబీ ఛాయలే లేకుండా ఒక సరికొత్త వైబ్, డిఫరెంట్ వరల్డ్‌ను క్రియేట్ చేయడంలో డైరెక్టర్ ఆదిత్య హాసన్ మొదటి సక్సెస్ కొట్టేశారని అన్నారు. నగేష్ కుకునూర్, ఇంతియాజ్ అలీ తరహా డెలికేట్, మోడ్రన్ టచ్ ఆదిత్య టేకింగ్‌లో కనిపిస్తోందన్నారు. ఇక దేవరకొండ ఫ్యామిలీతో తనకున్న రిలేషన్ గురించి చెబుతూ.. ఆ ఫ్యామిలీ అంటేనే తనకు ఒక ప్రత్యేకమైన వార్మ్‌త్ ఉంటుందని తెలిపారు.
‘ఖుషి’ మొదలైనప్పటి నుంచి తనను అన్నలా చూసే ఆనంద్ దేవరకొండ ఆప్యాయత, విజయ్ దేవరకొండతో ఉన్న క్లోజ్‌నెస్ ఎప్పటికీ ప్రత్యేకమేనని చెప్పారు. ఆనంద్‌కు ఉన్న ‘పక్కింటబ్బాయి’ ఇమేజ్ పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’, ప్రభాస్ ‘వర్షం’, మహేష్ బాబు ‘పోకిరి’, సిద్ధార్థ్ ‘బొమ్మరిల్లు’ తరహాలో ఎప్పటికీ ఎక్స్‌పైరీ లేని అరుదైన క్వాలిటీ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వహాబ్‌ను పొగుడుతూ.. ‘సంచారమే’ పాట వినగానే స్వయంగా ఫోన్ చేసి అభినందించినట్లు చెప్పారు. మలయాళం నుంచి వచ్చి తెలుగులో మెలోడీ బ్రహ్మలా మారిన హిషామ్ పనితనం అద్భుతమన్నారు. నటీనటులు, టెక్నీషియన్లతో పాటు నిర్మాత నాగవంశీకి ఈ సినిమా థియేటర్లలో పెద్ద బ్లాక్‌బస్టర్ వైబ్‌ను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు శివ నిర్వాణ తన ప్రసంగాన్ని ముగించారు.