మూడ్ ఆఫ్ ది నేషన్ తో రష్మికకు బాలీవుడ్ లో కలిసొచ్చేనా?
బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా స్థిరపడటానికి రష్మికకు రాబోయే ప్రాజెక్టులు ఎంతో కీలకం కానున్నాయి.
నేషనల్ క్రష్ గా వెలిగిపోతున్న రష్మిక మందన్న మరొక అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. ప్రముఖ ఆంగ్ల మాధ్యమం నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన కథానాయికగా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సౌత్ నుంచి నార్త్ వరకు వరుస పాన్-ఇండియా విజయాలతో దూసుకుపోతున్న అమ్మడు ఈ రేసులో బాలీవుడ్ , సౌత్ అగ్ర కథానాయికలైన దీపికా పదుకునే, ఆలియా భట్, శ్రద్ధా కపూర్, సాయి పల్లవి వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
దక్షిణాదిలో `కిరిక్ పార్టీ`తో ప్రారంభమైన రష్మిక ప్రయాణం టాలీవుడ్‌లో `ఛలో`, `గీత గోవిందం`, `సరిలేరు నీకెవ్వరుస`, `పుష్ప` వంటి బ్లాక్‌బస్టర్లతో అగ్ర స్థాయికి చేరింది. అటుపై నెమ్మదిగా హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కన్నడ భామ `గుడ్ బై`, `మిషన్ మజ్ను` చిత్రాలతో నటన పరంగా ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా రణ్‌బీర్ కపూర్ సరసన నటించిన `యానిమల్` చిత్రం నార్త్ ఇండియాలో సాధించిన సంచలన విజయం ఆమెను బాలీవుడ్ స్టార్ రేసులో ముందంజలో నిలబెట్టింది. ఈ క్రమశిక్షణే నేడు రష్మికను మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో అగ్రస్థానంలో నిలబెట్టింది.
అయితే ఈ రకమైన సర్వేలు, ప్రజాదరణ అనేది తాత్కాలిక ఊపును మాత్రమే ఇవ్వగలవు. బాలీవుడ్‌లో దీపికా పదుకునే, ఆలియా భట్ వంటి తారలు దశాబ్ద కాలంగా నటన, విభిన్నమైన పాత్రలు , స్థిరమైన బాక్సాఫీస్ స్టామినాతో సొంతం చేసుకున్న స్టార్‌డమ్ బలమైంది. రష్మిక సర్వేలో నెంబర్ వన్‌గా నిలిచినంత మాత్రాన బాలీవుడ్ అగ్ర పీఠం వెంటనే దక్కుతుందని చెప్పలేం. ఈ క్రేజ్‌ను స్థిరమైన విజయాలుగా, సోలో మార్కెట్‌గా మార్చుకు న్నప్పుడే రష్మిక హిందీ పరిశ్రమలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకోగలరు.
బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా స్థిరపడటానికి రష్మికకు రాబోయే ప్రాజెక్టులు ఎంతో కీలకం కానున్నాయి. కమ ర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథానాయిక ప్రాధాన్యం ఉన్న విభిన్నమైన కథలను, లేడీ ఓరియంటెడ్ చిత్రాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆలియా భట్ తరహాలో నటనకు ఆస్కారమున్న కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసినప్పుడే నటిగా సుదీర్ఘ కాలం నిలదొక్కుకోవడం సాధ్యమవుతుంది.
మరోవైపు ఉత్తరాది ప్రేక్షకుల్లో రష్మికకు ఉన్న ఆదరణ ప్రచార చిత్రాలకు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లకు, సోషల్ మీడియా రీచ్‌కు దోహదపడుతుంది. బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవడానికి నేషనల్ క్రేజ్ ఒక ప్రధాన ప్రాతిపదికగా మారుతుంది. సౌత్, నార్త్ అనే భేదం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ కావడం రష్మికకు ఉన్న అతిపెద్ద సానుకూల అంశం.
అంతిమంగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే విజయం రష్మిక బాలీవుడ్ ప్రయాణానికి మంచి బూస్టప్‌ను, సానుకూల వాతావరణాన్ని అందించింది. లభించిన క్రేజ్‌ను సరైన కథల ఎంపిక, నటనలో వైవిధ్యం , స్థిరమైన బాక్సాఫీస్ విజయాలతో ముందుకు తీసుకెళ్తే రాబోయే రోజుల్లో రష్మిక మందన్న బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా స్థిరపడటం పెద్ద విషయం కాదు.