విజయ్ లండన్ వెళ్లేది ఫ్యామిలీ కోసమేనా?
ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని, దూరంగా ఉంటున్నారని, చివరకు విడాకుల వ్యవహారం వరకు వెళ్లిందనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి.
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ లండన్ వెళ్తున్నారు.. మరి అక్కడే ఉన్న భార్య సంగీత, కూతురు దివ్యను కలవనున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న ఇదే. కొంతకాలంగా విజయ్ పర్సనల్ లైఫ్ చుట్టూ చర్చలు సాగుతుండగా.. తాజాగా బ్రిటన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సంగీత విడాకుల పిటిషన్ ను వెనక్కి తీసుకోవడంతో.. కుటుంబంలో పరిస్థితులు మారాయా? అన్న చర్చ మొదలైంది.
విజయ్, సంగీత దంపతులకు సంబంధించి గత కొంతకాలంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని, దూరంగా ఉంటున్నారని, చివరకు విడాకుల వ్యవహారం వరకు వెళ్లిందనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఆ వార్తలపై అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. అయితే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇలాంటి సమయంలో సంగీత విడాకుల పిటిషన్ ను వెనక్కి తీసుకోవడం ఇప్పుడు కొత్త చర్చకు కారణమైంది.
కేసు ఉపసంహరణతో అసలు ఏం జరిగింది? ఇద్దరి మధ్య సమస్యలు పరిష్కారమయ్యాయా? లేక దీనికి వేరే కారణం ఉందా? అనే ప్రశ్నలు అనేక మంది నుంచి వచ్చాయి. అదే సమయంలో విజయ్, సంగీత మళ్లీ ఒక్కటయ్యే అవకాశం ఉందనే ప్రచారం కూడా తమిళనాట మొదలైంది. ఇక్కడే విజయ్ లండన్ విజిట్ ఇంపార్టెన్స్ సంపాదించుకుంది. లండన్ లో సంగీత, కూతురు దివ్య ఉంటున్నారని.. విజయ్ తన పర్యటనలో వారిని కలవనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాకపోయినా.. విడాకుల కేసు ఉపసంహరణ వార్తల తర్వాత ఆ ప్రచారం మరింత ఆసక్తిని రేపుతోంది. ఒకవేళ విజయ్ కుటుంబాన్ని కలిస్తే.. అది కేవలం నార్మల్ మీట్ గానే ఉంటుందా? లేక ఇన్నాళ్లుగా సాగుతున్న వ్యక్తిగత జీవితంపై చర్చలకు ముగింపు పలికే పరిణామంగా మారుతుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి విషయాలపై విజయ్ లేదా సంగీత నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో.. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలను రూమర్స్ గానే చూడాల్సి ఉంటుంది.
మరోవైపు విజయ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో చర్చలు ఆగడం లేదు. ఆయన లండన్ పర్యటన, అక్కడ కుటుంబ సభ్యులతో భేటీకి సంబంధించిన ప్రచారం.. గతంలో వచ్చిన వార్తలను మరోసారి తెరపైకి తీసుకొస్తోంది. దీంతో అభిమానులు విజయ్ వ్యక్తిగత జీవితంలో అసలేం జరుగుతోందనే విషయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏదేమైనా సంగీత విడాకుల కేసును వెనక్కి తీసుకోవడం, ఆ తర్వాత విజయ్ లండన్ వెళ్లడం, అక్కడ కుటుంబ సభ్యులతో భేటీ అవుతారనే ప్రచారం.. ఆ మూడు ఇప్పుడు ఒకదానితో ఒకటి లింక్ అయ్యి ఉన్నాయి. నిజంగానే విజయ్, సంగీత మధ్య సయోధ్య కుదిరిందా? లండన్ లో కుటుంబంతో విజయ్ భేటీ అవుతారా? అన్నదానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ ఆ పరిణామాలు మాత్రం విజయ్ వ్యక్తిగత జీవితంపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. అందుకే ఇప్పుడు అనేక మంది లండన్ పర్యటన ప్లాన్ ప్రకారమే జరుగుతుందా అని డిస్కస్ చేసుకుంటున్నారు.