ఆర్సీ 17 కోసం రంగంలోకి హాలీవుడ్ డిజైనర్!
సాధారణంగా సుకుమార్ సినిమాల్లో హృరోల రూపకల్పన పై అత్యంత శ్రద్ధ వహిస్తారు. `రంగస్థలం`లో చిట్టిబాబుగా రామ్ చరణ్‌ను తీర్చిదిద్దిన తీరు..
`రంగస్థలం` లాంటి హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మరో చిత్రం `RC17` లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. దీంతో సుకుమార్ ప్రాజెక్ట్‌ను విజువల్ ప్రమాణాల పరంగా, ప్రొడక్షన్ విలువల్లోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా రామ్ చరణ్ మేకోవర్ - లుక్ డిజైన్ కోసం ఏకంగా హాలీవుడ్ ఫ్యాషన్ బ్రాండ్ అండ్ డిజైనర్ జార్జియో అర్మానీని రంగంలోకి దించే యోచనలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా సుకుమార్ సినిమాల్లో హృరోల రూపకల్పన పై అత్యంత శ్రద్ధ వహిస్తారు. `రంగస్థలం`లో చిట్టిబాబుగా రామ్ చరణ్‌ను తీర్చిదిద్దిన తీరు.. ఆయన క్యారెక్టరైజేషన్.. కాస్ట్యూమ్స్ ఇప్పటికీ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో `RC17` కోసం అంతకు మించిన మేకోవర్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఈ సారి రామ్ చరణ్ క్యారెక్టర్ ఆర్క్ డిఫరెంట్‌గా ఉండబోతోందని.. అందుకే అంతర్జాతీయ స్థాయి శైలి ఫినిషింగ్ కోసం హాలీవుడ్ డిజైనింగ్ బ్రాండ్స్‌ను సంప్రదిస్తున్నట్లు వినిపిస్తోంది.
గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా గుర్తింపు పొందిన నేపథ్యంలో రామ్ చరణ్ మార్కెట్ పరిధి కూడా నార్త్ ఇండియా - విదేశాలకు విస్తరించింది. `ఆర్ ఆర్ ఆర్` తర్వాత చరణ్ సాధించిన జాతీయ, అంతర్జాతీయ పాపులారిటీకి తగినట్లుగా చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేలా సుకుమార్ కేర్ తీసుకుంటున్నారు. జార్జియో అర్మానీ వంటి గ్లోబల్ ఫ్యాషన్ లేబుల్‌ని భాగం చేయడం ద్వారా రామ్ చరణ్ లుక్‌కి స్టైలిష్ - గ్రాండ్ అపీల్ తీసుకురావచ్చని భావిస్తున్నారు.
ఇదే గనుక నిజమైతే తెలుగు సినిమా కథానాయకుడి లుక్ కోసం హాలీవుడ్ దిగ్గజ డిజైనర్ .. ఇంటర్నేషనల్ బ్రాండ్‌ను నేరుగా సంప్రదించడం టాలీవుడ్‌లో అరుదైన మైలురాయిగా నిలుస్తుంది. గతంలో కొందరు హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు, విఎఫ్ఎక్స్ నిపుణులను భారతీయ చిత్రాలకు పనిచేసినా? కాస్ట్యూమ్ అండ్ మేకోవర్ విభాగంలో ఈ స్థాయి గ్లోబల్ కొలాబరేషన్ జరగడం ఇదే తొలిసారి. ఇది సినిమా మార్కెటింగ్‌కు -ఇంటర్నేషనల్ హైప్‌కి ఎంతో దోహదపడుతుంది. రామ్ చరణ్ పై లుక్ టెస్ట్ పూర్తయిన తర్వాత మేకర్స్ డిజైనర్ కొలాబరేషన్‌పై అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ , ప్రీ-విజువలైజేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో చరణ్ కి జోడీగా నటించే కథానాయకి ఎంపిక కూడా కత్తి మీద సాములా మారింది. ఏ హీరోయిన్ ని తీసుకోవాలి అన్న దానిపై సుకుమార్ అండ్ కో తర్జన భర్జన పడుతోంది. చరణ్ గ్లోబల్ ఇమేజ్ ను మ్యాచ్ చేసే నాయికనే తీసుకోవాలి. అందుకోసం సుకుమార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.