గూగుల్‌ లో నా పేరు కొడితే.. అదే నా లైఫ్‌ లో ఎపిక్ మూమెంట్: వైష్ణవి చైతన్య

బేబీ సినిమాతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య.. ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు.

Update: 2026-09-04 17:19 GMT

బేబీ సినిమాతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య.. ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ఆనంద్ దేవరకొండతో కలిసి బేబీలో నటించి సూపర్ హిట్ అందుకున్న ఆ జోడీ.. మరోసారి ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్‌ తో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా హైదరాబాద్‌ లో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ లో వైష్ణవి చైతన్య తన సినీ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు 'నిన్ను ఎవరు గుర్తుపడతారు? గూగుల్‌ లో నీ పేరు కొడితే నీ గురించి వస్తుందా?' అంటూ తనను ప్రశ్నించారని తెలిపారు. ఆ మాటలు ఎంతో బాధపెట్టాయని చెప్పారు. అయితే అదే ప్రశ్నకు ఇప్పుడు తన విజయమే సమాధానంగా మారిందన్నారు. 'ఒకప్పుడు నన్ను ఎవరు గుర్తుపడతారా? అని అడిగారు. గూగుల్‌ లో నీ కోసం వస్తుందా' అని ప్రశ్నించారు. అప్పుడు చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు గూగుల్‌లో వైష్ణవి చైతన్య అని పేరు టైప్ చేస్తే.. నా గురించి పూర్తి వివరాలు వస్తాయి. ఇదే నా జీవితంలో ఎపిక్ మూమెంట్ అని వైష్ణవి చెప్పుకొచ్చారు.

తన కెరీర్‌ లో సాధించిన గుర్తింపును ఆమె ఎమోషన్ తో పంచుకున్నారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన రష్మిక మందన్నకు వైష్ణవి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపారు. నేషనల్ క్రష్ నుంచి నేషనల్ స్టార్ గా ఎదిగిన రష్మిక ప్రయాణం తనతో పాటు ఎంతో మంది అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ అని అన్నారు. ప్రతి ఒక్కరిలోనూ స్పెషల్ టాలెంట్ ఉంటుందని, మరొకరిలా మారాల్సిన అవసరం లేదనే విషయాన్ని రష్మిక తన ప్రయాణంతో నిరూపించారని ప్రశంసించారు.

బేబీ సినిమా నుంచి ఆనంద్ దేవరకొండ తనకు తెలుసని, అప్పటికి ఇప్పటికీ ఆయనలో పెద్దగా మార్పు కనిపించలేదని వైష్ణవి తెలిపారు. 'ఆయన నుంచి నేను ఒక విషయం నేర్చుకున్నాను. మన చుట్టూ ఉన్నవారు ఎదిగితే మనం కూడా సంతోషించాలి. ఆనంద్ చాలా రేర్ పర్సన్' అని అన్నారు. ఎపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ తనకు బెస్ట్ ఫ్రెండ్, ఫేవరెట్ డైరెక్టర్ అని వైష్ణవి తెలిపారు. సెట్స్‌ లో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారని, అవసరమైన విషయాలను స్పష్టంగా వివరించడంతో పాటు దర్శకుడిలా కాకుండా మంచి స్నేహితుడిగా తనకు అండగా నిలిచారని చెప్పారు. సినిమాలో తనను ఎంపిక చేసినందుకు థ్యాంక్స్ తెలిపారు.

'ఈవెంట్ కు గెస్టులుగా వచ్చిన వారందరికీ థ్యాంక్స్. శివ నిర్వాణ సార్.. ఇరుముడి సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్. మా అమ్మమ్మ కూడా ఆ సినిమాకు వచ్చింది. మూవీ చూసి ఎమోషనల్ అయింది. ప్రతి రోజూ ఇరుముడి సాంగ్స్ అండ్ వైబ్ ఉంటుంది. యాలోయాలో సాంగ్ అయితే సూపర్. శివ సార్.. నాకు టక్ జగదీష్ మూవీ జర్నీ గుర్తుంది. ఎప్పటికీ గుర్తుంటుంది. బేబీ తర్వాత నాకు మీ నుంచి వచ్చిన కాల్ రోజు కూడా గుర్తుంది. మాటలు కూడా గుర్తున్నాయి' అని వైష్ణవి తెలిపారు.

Tags:    

Similar News