'ఇరుముడి' శివ నిర్వాణ కెరీర్‌కు ఎంత కీలకమంటే!
నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన శివ నిర్వాణ ఆ తర్వాత మజిలీతో రేంజ్ పెంచుకున్నాడు.
నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన శివ నిర్వాణ ఆ తర్వాత మజిలీతో రేంజ్ పెంచుకున్నాడు. అయితే ఆ బ్లాక్ బస్టర్ వచ్చి అప్పుడే ఏడేళ్లు దాటిపోయింది. ఆ స్థాయి థియేట్రికల్ సక్సెస్ మళ్లీ శివ అకౌంట్లో పడలేదు. అందుకే ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న రవితేజ ఇరుముడి సినిమా అటు మాస్ రాజాకే కాకుండా దర్శకుడికి కూడా చాలా ఇంపార్టెంట్.
ఒకసారి పాత లెక్కలు చూస్తే 2017లో వచ్చిన నిన్ను కోరి ఏకంగా 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఆ తర్వాత రెండేళ్లకు వచ్చిన మజిలీ బాక్సాఫీస్ దగ్గర ఇంకో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తొలి వారంలోనే 45 కోట్ల గ్రాస్ రాబట్టి ఫైనల్ గా 70 కోట్ల దాకా వెళ్లి బయ్యర్లకు లాభాల పంట పండించింది. ఈ రెండు హిట్ల తర్వాత నానితో చేసిన టక్ జగదీష్ మీద జనాలు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ కరోనా టైమ్ లో ఆ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేయడంతో బాక్సాఫీస్ లెక్కలు వేయడానికి ఛాన్స్ లేకుండా పోయింది.
కంటెంట్ కు కూడా రొటీన్ అనే ఫీడ్ బ్యాక్ రావడంతో థియేటర్లలో తన సత్తా చూపే అవకాశాన్ని శివ అప్పట్లో మిస్ అయ్యాడు. ఆ తర్వాత 2023లో విజయ్ దేవరకొండ సమంత కాంబోలో ఖుషితో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సూపర్ హిట్ పాటల వల్ల ఓపెనింగ్స్ బాగానే వచ్చినా లాంగ్ రన్ లో మాత్రం సినిమా నిలబడలేకపోయింది. వరల్డ్ వైడ్ గా 37 కోట్ల షేర్ దగ్గర ఆగిపోయి బిలో యావరేజ్ గా మిగిలింది. ఇది శివ కెరీర్ ను మళ్లీ ట్రాక్ లోకి తెచ్చేంత సాలిడ్ హిట్ అయితే కాదు.
ఇప్పుడు ఇరుముడితో మళ్లీ తన బలం అయిన ఎమోషన్స్ నే నమ్ముకున్నాడు. ఈసారి రొమాంటిక్ లవ్ స్టోరీ కాకుండా తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కు అయ్యప్ప దీక్షను యాడ్ చేశాడు. ఇందులో అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీ చుట్టూ కథ నడుస్తుందని రవితేజ క్యారెక్టర్ చాలా రఫ్ గా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ కు ముందు వచ్చే 40 నిమిషాలు ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని శివ చెబుతున్నాడు.
ఇండస్ట్రీలో ఎంత మంచి టాలెంట్ ఉన్నా ఫైనల్ గా సినిమా కలెక్షన్స్ అనేది కెరీర్ కు చాలా ముఖ్యం. పాత బ్లాక్ బస్టర్స్ ను చూసి స్టార్ హీరోలు అవకాశాలు ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. అందుకే ఇరుముడికి పాజిటివ్ టాక్ రావడంతో పాటు కమర్షియల్ గా కూడా భారీ వసూళ్లు రాబట్టడం శివ నిర్వాణకు ఇప్పుడు చాలా అవసరం. ఈ సినిమా రిజల్ట్ మీదే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆధారపడి ఉన్నాయి.