మీరు స్క్రీన్‌షాట్‌లు తీసుకుంటూ బతికేయండి..!
బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ కాంట్రవర్సీ కపుల్‌ల జాబితాలో శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.;
బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ కాంట్రవర్సీ కపుల్‌ల జాబితాలో శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. శిల్పా శెట్టి హీరోయిన్‌గా ఏ స్థాయిలో గుర్తింపు గౌరవం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగా ఆమె సినిమాలను ప్రేక్షకులు చూశారు, హిందీతో పాటు సౌత్ ఇండియన్ భాషల్లోనూ ఆమె నటించడం ద్వారా అన్ని చోట్ల ఆమెకు అభిమానులు ఉన్నారు. గతంలో హీరోయిన్‌గా ఏ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుందో గత కొన్ని సంవత్సరాలుగా ఈమె తన భర్త రాజ్‌కుంద్రాతో కలిసి వివాదాలతో అంతగా వార్తల్లో నిలిచింది. ఎన్నో వివాదాలకు వీరు నెలవు అయ్యారు. రాజ్‌కుంద్రా పై చాలా పెద్ద నేరారోపణలు వచ్చాయి. వాటికి సంబంధించిన విచారణ జరుగుతోంది. ఇటీవల కూడా వీరిద్దరిపై ఒక చీటింగ్ కేసు నమోదు కావడంతో వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే.
శిల్పా శెట్టిపై సోషల్ మీడియాలో ట్రోల్స్...
ఇంతటి వివాదాలను ఎదుర్కొంటున్న శిల్పా శెట్టి ఇటీవల ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంది. దాంతో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ట్రోల్స్ చేశారు. తప్పుడు పనులు చేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటో అని, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తప్పులు మాఫీ అవుతాయా, లేదంటే చేసిన తప్పులు ఒప్పులు అవుతాయా అంటూ చాలా మంది ఆ ఫోటోలు వీడియోలను షేర్ చేయడం ద్వారా ట్రెండ్ చేశారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణశాస్త్రి నిర్వహించిన ఒక పాదయాత్రలో శిల్పా శెట్టి పాల్గొన్నారు. ఆమె మాత్రమే కాకుండా బాలీవుడ్‌కి చెందిన చాలా మంది ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఆ పాదయాత్రకు సంబంధించిన ఫోటోలు, స్క్రీన్ షాట్స్ తో సోషల్ మీడియాలో శిల్పా శెట్టిపై దుమ్ము ఎత్తి పోసినట్లుగా ట్రోల్స్ చేయడం, విమర్శలు గుప్పించడం జరుగుతుంది.
రాజ్‌కుంద్రా సోషల్ మీడియా కౌంటర్...
ఈ మధ్య కాలంలో శిల్పా శెట్టిపై జరుగుతున్న తీవ్రమైన నెగిటివిటీ ప్రచారం, ట్రోలింగ్ పై రాజ్‌కుంద్రా సీరియస్‌గా స్పందించాడు. ట్రోల్స్ చేస్తున్న వారిని, ఆ పాద యాత్ర గురించి విమర్శించిన వారిని ఉద్దేశించి రాజ్ కుంద్రా ఘాటు విమర్శలు చేయడం జరిగింది. రాజ్ కుంద్రా సోషల్ మీడియాలో స్పందిస్తూ... కొందరు ఎప్పటికీ ఇలాంటి నిందలు వేస్తూనే ఉంటారు, ఎందుకంటే వారు ఎప్పటికీ చీకటిలోనే ఉండాలి అనుకుంటారు. వారు ఆరోపణలు, నేరారోపణలు వేరు వేరు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించాడు. కొందరు పని కట్టుకుని ట్రోల్స్ చేయడం, దాంతో సంతృప్తి చెందడం జరుగుతుంది. కొందరు మాత్రం ఎప్పుడూ శాంతి, ప్రశాంతత కోరుకుంటారు. చివరకు సనాతన ధర్మ గురించి నిలబడి, మద్దతు ఇచ్చినా ట్రోల్స్ చేయడం ద్వారా వారు ఏ స్థాయికి దిగజారి ట్రోల్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అన్నాడు.
శిల్పా శెట్టి - రాజ్‌కుంద్రాలపై కేసు..
అలాంటి ట్రోల్స్ చేసే వారు జీవితాంతం అక్కడే ఉండి పోతారు, వారు ఎప్పటికీ స్క్రీన్ షాట్స్ తీసుకుంటూ, సోషల్ మీడియాలో వారిని వీరిని ట్రోల్ చేస్తూ బతికేస్తూ ఉంటారు. వాకిని కొత్త జీవితం అనేది ఉండదు అన్నట్లుగా సీరియస్ వ్యాఖ్యలు చేశాడు. అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, నిజం ఎప్పటికి అయినా బయటకు వస్తుంది, కానీ అందుకు కాస్త సమయం పడుతుంది అన్నట్లుగా రాజ్ కుంద్రా కౌంటర్ ఇచ్చాడు. రాజ్ కుంద్రా పోస్ట్ ను ట్రోల్ చేసే వారు కొందరు అయితే, వారికి మద్దతుగా పోస్ట్‌లు చేస్తున్న వారు కొందరు ఉన్నారు. మొత్తానికి ట్రోల్స్ మీద ముఖ్యంగా శిల్పా శెట్టి ఆధ్యాత్మకి పాదయాత్ర పై వస్తున్న దారుణమైన ట్రోల్స్ పై రాజ్‌కుంద్రా స్పందించడంతో కాస్త ఆ ట్రోలింగ్‌కు అడ్డుకట్ట పడ్డట్లు అయిందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.