నటి మరణంపై అసత్య ప్రచారాలు తగవు!
ప్రముఖ నటి కం మోడల్ షెఫాలీ జరీవాలా అకాల మరణం అభిమానులను - చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రముఖ నటి కం మోడల్ షెఫాలీ జరీవాలా అకాల మరణం అభిమానులను - చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే షెఫాలీ మరణించిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు , అసత్య ప్రచారాలు మొదలయ్యాయి. ఆమె మరణానికి గల కారణాలపై శాస్త్రీయమైన ఆధారాలు లేకపోయినా? కొందరు పుకార్లను వ్యాప్తి చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. షెఫాలీ అందాన్ని కాపాడుకోవడానికి యవ్వనంగా కనిపించడానికి యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు తీసుకుందని అవే ఆమె ప్రాణాల మీదకు తెచ్చాయని వార్తలు వస్తున్నాయి.
ఈ రకమైన ఇంజెక్షన్లు , కాస్మెటిక్ చికిత్సల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే గుండెపోటుకు గురైందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో గ్లామర్ రంగంలో ఉండే వారి భద్రతపై ఈ ప్రచారం మరింత ఆందోళనను పెంచుతోంది. అయితే ఈ ప్రచారంపై షెఫాలీ కుటుంబ సభ్యులు , సన్నిహితులు తీవ్రంగా స్పందించారు. మరణించిన వ్యక్తిపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం అమానుషమని వారు మండి పడ్డారు. షెఫాలీ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించేదని ఆమె ఎప్పుడూ తన లైఫ్ స్టైల్ ను ప్రకృతి సిద్ధంగానే ఉంచు కునేదని చెబుతున్నారు.
వైద్య నివేదికలు రాకముందే ఇలాంటి ముగింపులకు రావడం సరికాదని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల వల్ల ఆమె కుటుంబం ఎంతో మానసిక వేదనకు గురవుతోంది. ఒక సెలబ్రిటీ మరణించినప్పుడు వారి వ్యక్తిగత జీవితం, పరువు గురించి ఆలోచించకుండా తప్పుడు సమాచారాన్ని షేర్ చేయడం వ్యసనంగా మారింది. ఈ ఘటనతో కాస్మెటిక్ చికిత్సల గురించి కూడా మరోసారి చర్చ మొదలైంది. ఒకవేళ నిజంగా అలాంటి ఇంజెక్షన్ల వల్ల మరణం సంభవిస్తే? అది చాలా తీవ్రమైన విషయం. కానీ నిరూపితం కాకుండా ఎవరినీ నిందించకూడదు.
ఈ ఘటనతో కాస్మెటిక్ చికిత్సల గురించి కూడా మరోసారి చర్చ మొదలైంది. గతంలో లైపో సర్జరీ వికటించి మరణించిన వారి వివరాల గురించి నెటి జనులు నెట్టింట అన్వేషిస్తున్నారు. షెఫాలీ జరీవాలా సక్సెస్ ట్రాక్ చూస్తే? కెరీర్‌లో చేసినవి తక్కువ పాటలే అయినా? ఆమె ప్రదర్శించిన ఎనర్జీ గ్లామర్ భారతీయ పాప్ సంగీత రంగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించాయి. 2002లో రిలీజ్ అయిన `కాంటా లగా` రీమిక్స్ సాంగ్ ఒక సంచలనం. ఆ పాటలో సెఫాలీ స్టైల్, డ్యాన్స్ మూమెంట్స్ ఆనాటి ట్రెండీ లుక్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఆ ఒక్క పాటతో ఆమె రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. `రీమిక్స్ క్వీన్` అనే బిరుదును దక్కించుకుంది. ఆ కాలంలో మ్యూజిక్ ఛానల్స్‌లో ఈ పాట అత్యధికంగా ప్లే చేయబడిన రికార్డును సొంతం చేసుకుంది. అటుపై షెఫాలీ మరికొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ - సినిమా పాటల్లో కనిపించినా? ప్రతి పాటలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె ఎక్కువగా పెప్పీ డ్యాన్స్ నెంబర్లకు ప్రాధాన్యతనిచ్చింది.`కభీ ఆర్ కభీ పార్' వంటి రీమిక్స్ సాంగ్స్‌లోనూ ఆమె హొయలు ప్రేక్షకులను అలరించాయి. గ్లామర్ మాత్రమే కాకుండా స్క్రీన్ మీద ఆమె పలికించిన హావభావాలు పాటల విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి.