మరో టాలీవుడ్ ఛాన్స్ ను అందుకున్న రుక్మిణి
ఆల్రెడీ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణి, కాంతార సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఈ మూవీ తర్వాత తనకు అవకాశాలు విపరీతంగా వస్తున్నట్టు తెలుస్తోంది.;
రీసెంట్ టైమ్స్ లో హీరోయిన్లుగా ఎక్కువ వినిపిస్తున్న పేర్లు రష్మిక మందన్నా, శ్రీలీల, కియారా, భాగ్య శ్రీ బోర్సే. ఇలాంటి టైమ్ లో ఎవరూ ఊహించని విధంగా అవకాశాలు అందుకుంటూ తన పేరుని కూడా రేసులో ఉండేలా చేసుకున్నారు కన్నడ నటి రుక్మిణి వసంత్. కాంతార చాప్టర్1 లో రాజ కుమారి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు రుక్మిణి.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడోతో టాలీవుడ్ డెబ్యూ
సప్త సాగరాలు దాటి ఫ్రాంచైజ్ సినిమాల్లో నటించి తన నేచురల్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్న రుక్మిణి ఆ తర్వాత తెలుగులో నిఖిల్ హీరోగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమా చేశారు కానీ ఆ సినిమా అసలెప్పుడు వచ్చి వెళ్లిందో కూడా ఆడియన్స్ కు తెలియలేదు. అయితే ఆ సినిమా ఫ్లాపైనప్పటికీ రుక్మిణికి అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి.
ఎన్టీఆర్ నీల్ సినిమాలో హీరోయిన్‌గా..
ఆల్రెడీ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణి, కాంతార సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఈ మూవీ తర్వాత తనకు అవకాశాలు విపరీతంగా వస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ పలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న రుక్మిణి, రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కూడా ఎంపికైనట్టు వార్తలొస్తున్నాయి.
కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్న శ్రీను వైట్ల
ఇవి కాకుండా రుక్మిణి ఇప్పుడు మరో తెలుగు సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రానున్న ఓ సినిమాలో రుక్మిణిని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్ల ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీలో మరో సీనియర్ హీరో నటించనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రుక్మిణికి పెద్ద బ్యానర్లలో అవకాశాలు మాత్రం వరుస పెట్టి వస్తున్నాయి.