17 ఏళ్ల తర్వాత వైట్ల పండుగ ఎంట్రీ

శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జార్జ్ క్రిష్' సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సెట్స్ పైకి వెళ్లింది.

Update: 2026-08-14 10:31 GMT

శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జార్జ్ క్రిష్' సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సెట్స్ పైకి వెళ్లింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ఓ ప్లాన్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఐదు నెలల వ్యవధిలోనే శరవేగంగా పూర్తి చేసి పండుగ బరిలో దింపడం అంటే మామూలు విషయం కాదు. కానీ చాలా చాలా కాలంగా సక్సెస్ కోసం చూస్తున్న వైట్లకు ఇది సేఫ్ సీజన్.

గతంలో పెద్దగా ఈ దర్శకుడు సంక్రాంతికి వచ్చింది లేదు. శ్రీను వైట్ల ఫిల్మోగ్రఫీని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జనవరి 14వ తేదీతో ఆయనకు ఒక ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. వెంకటేష్ హీరోగా ఆయన తెరకెక్కించిన సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నమో వెంకటేశ' 2010లో సరిగ్గా ఇదే తారీఖున బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఏకంగా పదిహేడేళ్ల లాల్ తర్వాత శ్రీను వైట్ల తన కొత్త సినిమాను ఎగ్జాక్ట్‌గా అదే స్పెషల్ డేట్‌కు రిలీజ్ చేస్తుండటం విశేషం.

పండుగ సెలవుల్లో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిస్థాయిలో నవ్వుకునే కథలనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. గత కొన్నేళ్లుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి సరిగ్గా ఇదే పల్స్ పట్టుకుని ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు లాంటి సక్సెస్‌లు అందుకున్నాడు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలతో కూడా ఈ ఫెస్టివల్ మార్కెట్‌ను తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఎలా టార్గెట్ చేయొచ్చో అనిల్ నిరూపించాడు.

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్స్ అనగానే అందరికీ ముందుగా శ్రీను వైట్ల పేరే మైండ్ లోకి వచ్చేది. కొంతకాలంగా సరైన హిట్ లేక ఆయన ఫామ్ కోల్పోయినా, తనకి బాగా పట్టున్న వినోదాన్నే నమ్ముకుని ఈ కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. అనిల్ రావిపూడికి చాలా బలంగా మారిన ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లోనే ఇప్పుడు శ్రీను వైట్ల తన బలమైన కంబ్యాక్ కోసం అడుగులు వేయడం ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు పెంచుతోంది.

ఇక హీరో శర్వానంద్‌కు కూడా ఫెస్టివల్ బరిలో చాలా మంచి హిస్టరీ ఉండటం ఈ ప్రాజెక్ట్‌కు బాగా కలిసొచ్చే అంశం. గతంలో భారీ చిత్రాల పోటీ మధ్య విడుదలై మంచి విజయాలు సాధించిన ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి లాంటి చిత్రాలు శర్వాకు ఫ్యామిలీ క్రౌడ్‌ను దగ్గర చేశాయి. రీసెంట్‌గా వచ్చిన నారి నారి నడుమ మురారి కూడా ఇదే సీజన్ అడ్వాంటేజ్‌తో మంచి రిజల్ట్ సాధించి శర్వానంద్ సక్సెస్ రేటును స్ట్రాంగ్ గా నిలబెట్టింది. ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నప్పటికీ ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ అనేది చివరగా శ్రీను వైట్ల రాసుకున్న స్క్రిప్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆయన తన పాత స్టైల్ తో కథలో బలమైన హాస్యాన్ని తెరమీద పండిస్తే హాలిడే వాతావరణం కచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌కు ఒక పెద్ద ప్లస్ అవుతుంది.

Tags:    

Similar News