• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భోగితో శ‌ర్వా పాన్ ఇండియా...

భోగితో శ‌ర్వా పాన్ ఇండియా ప్ర‌యోగం?

| చార్మింగ్ స్టార్ శ‌ర్వానంద్, సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ డ్రామా చేయ‌నున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-04-30 08:17 GMT

చార్మింగ్ స్టార్ శ‌ర్వానంద్, సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ డ్రామా చేయ‌నున్న విషయం తెలిసిందే. శ‌ర్వ కెరీర్లో 38వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తున్న విష‌యాన్ని అనౌన్స్ చేస్తూ మేక‌ర్స్ ఫ‌స్ట్ స్పార్క్ పేరుతో చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేయ‌గా, ఆ గ్లింప్స్ ఆడియ‌న్స్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

గ్లింప్స్ చూస్తుంటే ఈ సినిమా విలేజ్ యాక్ష‌న్ డ్రామా అని అర్థ‌మ‌వుతుంది. అంతేకాదు, ఆ వీడియోలో మోర్ వ‌యొలెన్స్ అని చెప్తున్నారంటే సినిమాలో హింస ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఎప్పుడూ సాఫ్ట్ సినిమాలు చేస్తూ ప‌క్కింటి అబ్బాయిలా క‌నిపించే శ‌ర్వానంద్ ఈ మూవీ కోసం భారీగా మేకోవ‌ర్ కానున్నాడ‌ని తెలుస్తోంది.

దీంతో ఈ సినిమాలో శ‌ర్వా లుక్ ఎలా ఉంటుందోన‌ని చూడ్డానికి అంద‌రూ ఎంత‌గానో ఆస‌క్తిగా ఉన్నారు. శ‌ర్వా కెరీర్ లో 38వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ స్పార్క్ ను రిలీజ్ చేయ‌డంతో పాటూ ఈ సినిమా టైటిల్ ను భోగి అని కూడా మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. టైటిల్ కూడా చాలా కొత్త‌గా అనిపిస్తుంది.

1960ల కాలం నాటి తెలంగాణ‌- మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు గ్రామంలో జ‌రిగిన క‌థ ఆధారంగా ఈ యాక్ష‌న్ డ్రామా రూపొందుతున్న‌ట్టు స‌మాచారం. అంతేకాదు, ఈ సినిమా కొన్ని నిజ జీవిత సంఘ‌ట‌న‌ల నుంచి పుట్టింద‌ని కూడా మేక‌ర్స్ చెప్తున్నారు. ఈ మూవీలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, డింపుల్ హ‌యాతి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

అనౌన్స్‌మెంట్ వీడియోలోని హై క్వాలిటీ వీఎఫెక్స్ అంద‌రినీ ఆక‌ట్టుకోగా, ఈ సినిమా షూటింగ్ ఇవాళ హైద‌రాబాద్ లో వేసిన స్పెష‌ల్ సెట్ లో ప్రారంభ‌మైంది. కె.కె రాధామోహ‌న్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. భోగితో శ‌ర్వా కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు.

Full View
Tags:    
  • Sharwanand 
  • SampathNandi 
  • AnupamaParameswaran 
  • DimpleHayati 
  • Bhogi 
  • CharmingStar 
  • SharwanandLooks 
  • KKRadhamohan 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

సింపుల్గా సిద్ధార్థ్ గల్లా పెళ్లి.. మరి మహేష్ బాబు ఎక్కడ?

2026-11-25 12:51 GMT

రెండు సినిమాలతో రెండు సెంటిమెంట్స్.. డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు?

2026-11-25 12:48 GMT

రామాయణం ఎఫెక్ట్.. సాయిపల్లవి లెక్కలు మారతాయా!

2026-11-25 12:04 GMT

ఒక్క తప్పిదం..చేజారుతున్న షోలు!

2026-11-25 11:30 GMT

అన్నాచెల్లెళ్ల కథే.. మరి ఈ ట్విస్ట్ ఏంటి?

2026-11-25 11:02 GMT

రెట్రో లుక్‌తో ఆకట్టుకుంటున్న అనుపమ

2026-11-25 11:02 GMT

విశ్వంభర.. సంక్రాంతికి వస్తే సరిపోతుందా?

2026-11-25 11:02 GMT

Tupaki Exclusive: ఫౌజీ గ్లింప్స్ లో వచ్చిన ఫైట్ నేనే డిజైన్ చేశా.. అది సాంపిల్ మాత్రమే...

2026-11-25 10:47 GMT

Tupaki Exclusive: భోగి తెలంగాణ సినిమా కాదు...

2026-11-25 10:43 GMT

దేశం ముందు.. కళ తర్వాత.. పాక్ ఆర్టిస్టుల కంటెంట్‌పై హాట్ టాపిక్

2026-11-25 10:30 GMT

కూతురు బర్తడే స్పెషల్.. ఊహించని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ!

2026-11-25 10:10 GMT

సంబ‌రాల బాబు సౌండ్ గ‌ట్టిగానే చేయాలి!

2026-11-25 10:10 GMT

Copyright @2026

Powered by Blink CMS