రక్షా బంధన్ స్పెషల్..చెల్లెళ్ళతో భోగి నుంచి శర్వానంద్ స్పెషల్ పోస్టర్!

నేడు రక్షాబంధన్ కావడంతో పలువురు సెలబ్రిటీలు తమ తోబుట్టువులకు రాఖీ కడుతూ ఈ పర్వదినాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.

Update: 2026-08-28 12:24 GMT

నేడు రక్షాబంధన్ కావడంతో పలువురు సెలబ్రిటీలు తమ తోబుట్టువులకు రాఖీ కడుతూ ఈ పర్వదినాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అటు సినిమాలో కూడా పోస్టర్లను వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న శర్వానంద్ తాజాగా నటిస్తున్న చిత్రం భోగి. సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా పై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా రక్షాబంధన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో కనిపిస్తున్న శర్వానంద్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.




 


రక్షాబంధన్ స్పెషల్.. భోగి నుండి స్పెషల్ పోస్టర్..

తాజాగా రక్షాబంధన్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో శర్వానంద్ తన ఐదుగురు సోదరీమణులతో కలసి కనిపించారు. చుట్టూ తాటి చెట్లు.. మట్టి ఇల్లు.. పల్లెటూరి వాతావరణంలో అన్నయ్య తాటి ముంజలు కొట్టిస్తుంటే.. చేతి ముని వేళ్ళతో చెల్లెళ్లు ఎంతో ఇష్టంగా తింటున్నట్టు ఒక పోస్టర్ విడుదల చేసారు . ఈ పోస్టర్ చూస్తుంటే పాతకాలంలోకి తీసుకెళ్లేలా కనిపిస్తోంది. గ్రామీణ వాతావరణాన్ని.. అప్పటి లైఫ్ స్టైల్ ను ప్రతిబింబించేలా ఈ పోస్టర్ ను చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇందులో శర్వానంద్ గంగా అనే పాత్రలో నటిస్తున్నారు . ఈ పోస్టర్తో పాటు "గంగా ఒక్కడే కానీ ప్రాణాలు ఐదు" అంటూ షేర్ చేసిన క్యాప్షన్ ఆకట్టుకుంటుంది. పైగా 1964 ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం.. మొత్తానికైతే రక్షాబంధన్ సందర్భంగా విడుదల చేసిన ఈ స్పెషల్ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.

భిన్నమైన గెటప్లో శర్వానంద్..

ఇకపోతే శర్వానంద్ ఎప్పుడు కూడా చాలా క్లాసిక్ లుక్ లో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే తొలిసారి ఆయన తన లుక్ పూర్తిగా మార్చేశారు. ఇప్పటివరకు వచ్చిన పాత్రలకు భిన్నంగా శర్వా ఈ సినిమాలో కనిపించబోతున్నారని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. పల్లెటూరి యువకుడిగా కనిపించబోతున్న శర్వానంద్ కి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

భోగి సినిమా షెడ్యూల్..

భోగి సినిమా షెడ్యూల్ విషయానికొస్తే.. ఇటీవలే భారీ క్లైమాక్స్ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. దీంతో సినిమా షూటింగ్ కి సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయినట్లే అని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాని రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు రిలీజ్ చేయాలని అనుకున్నారు . కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఏర్పడిన జాప్యం వల్లే రిలీజ్ కి కాస్త ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీజీ వర్క్ పూర్తవడానికి ఇంకా సమయం పడుతుంది . కాబట్టే రిలీజ్ డేట్ విషయంలో చిత్ర బృందం తొందరపడడం లేదని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధా మోహన్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో రాబోతున్న ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

Tags:    

Similar News