శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్.. మరి ఇండియన్ 3 పరిస్థితేంటి?

ఇప్పటి వరకు కెరీర్ లో అనేక హిట్స్ అందుకున్న దర్శకుడు శంకర్.. భారతీయ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కు తీసుకెళ్లారు. రీసెంట్ గా మాత్రం గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 సినిమాలతో నిరాశపరిచారు.;

Update: 2025-12-03 01:30 GMT

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. జెంటిల్‌ మన్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో వంటి వివిధ సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్న ఆయన.. టెక్నికల్ పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తీసుకొచ్చే దర్శకుడిగా ఫేమ్ సొంతం చేసుకున్నారు.

ఇప్పటి వరకు కెరీర్ లో అనేక హిట్స్ అందుకున్న దర్శకుడు శంకర్.. భారతీయ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కు తీసుకెళ్లారు. రీసెంట్ గా మాత్రం గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 సినిమాలతో నిరాశపరిచారు. స్క్రిప్ట్ సెలెక్షన్ , స్క్రీన్ ప్లే సహా అన్నింటిలో విఫ‌లం కావ‌డంతో ఆ రెండు చిత్రాలు.. దారుణంగా నిరాశపరిచాయి.

ఇప్పుడు శంకర్ నెక్ట్స్ ప్రాజెక్ట్.. హాట్ టాపిక్ గా మారింది. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో శంకర్ తన తదుపరి మూవీని వేల్పూరి నవల ఆధారంగా రూపొందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు రోబో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే, ఇప్పుడు వేల్పూరి తన కలల మూవీ అని తెలిపారు. కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తానని చెప్పారు.

ఇప్పుడు వేల్పూరి మూవీ ట్రాక్ ఎక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్యాస్టింగ్ ను కూడా ఫిక్స్ చేసే పనిలో ఉన్నారని సమాచారం. హీరోగా శివ కార్తికేయన్ ను తీసుకుని యోచనలో శంకర్ ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనతోపాటు సూర్య, ధనుష్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు వినికిడి.

అదంతా ఓకే అయినా.. ఇప్పుడు ఇండియన్-3 పరిస్థితేంటి అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో శంకర్ ను క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఇండియన్-1 బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ఇండియన్-2 మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఇండియన్-3పై నీలినీడలు కమ్ముకున్నాయి. సినిమా ఆగిపోయిందని వార్తలు రాగా.. మూవీ ఉంటుందని శంకర్ చెప్పారు.

ఇండియన్ 3 పూర్తి చేసిన తర్వాతే వేల్పూరి చేపడతానని వెల్లడించారు. కానీ ఇప్పుడు ఇండియన్-3 గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వని శంకర్.. వేల్పూరిపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దాని వెనుక కారణాలు ఏంటో ఆయనకే తెలియాలి. అయితే కమల్ హాసన్ ఇండియన్-3పై ఇంట్రెస్ట్ చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి. అందుకే వేల్పూరి పనులను శంకర్ స్టార్ట్ చేశారని వినికిడి.

Tags:    

Similar News