గ్లామర్ డోస్ ఓవర్ లోడెడ్.. సెగలు పుట్టిస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ!
షాలినీ పాండే.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని కుర్రకారు డ్రీమ్ గర్ల్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
షాలినీ పాండే.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని కుర్రకారు డ్రీమ్ గర్ల్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈమెకు ఇది తొలి తెలుగు చిత్రం అయినా.. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. పైగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే కెమిస్ట్రీ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా రౌడీ హీరోకి స్టార్ స్టేటస్ ను అందించిందని చెప్పవచ్చు. అలాంటి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న షాలిని పాండే మహానటి సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది.
కెరియర్ తొలినాళ్లలో సాంప్రదాయంగా నిండుగా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్న షాలినీ పాండే.. ఎన్టీఆర్ కథానాయకుడు, 118 , ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం ఇలా పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే తెరపై చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ అందరిని మెప్పిస్తున్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం టూ గ్లామర్ గా కనిపిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.. చిట్టి పొట్టి బట్టలతో గ్లామర్ వలకబోస్తూ సోషల్ మీడియాలో మంట రాజేస్తోంది అని చెప్పవచ్చు.
అందులో భాగంగానే తాజాగా సెల్ఫీ ఫోజులతో కిర్రాక్ లుక్ తో కుర్ర కారు గుండెల్లో సెగలు పుట్టించింది. బ్లాక్ స్లీవ్ లెస్ మినీ క్రాప్ టాప్ ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్ లో షార్ట్ టాప్ ధరించి గ్లామర్ అందాలను హైలెట్ చేసేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా సెల్ఫీ ఫోజులు ఇస్తూ పంచుకున్న ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈమె ఫోటోలు చూసి నెటిజన్స్ రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గ్లామర్ ఓవర్ లోడెడ్ అన్నట్టుగా షాలిని పాండే షేర్ చేసిన ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి అనడంలో సందేహం లేదు.
1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లో జన్మించింది. అక్కడే గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసిన షాలిని పాండే ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం నుండి నాటకాలలో నటించడం ప్రారంభించింది. ముఖ్యంగా నటనపై ఆసక్తితో నాటకాలలో చేస్తున్న సమయంలో 2017 లో అర్జున్ రెడ్డి అనే తెలుగు చిత్రంలో ఈమెకు అవకాశం లభించింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకం పై విడుదల చేశారు. రాహుల్ రామకృష్ణ, గోపీనాథ్ భట్ , కమల్ కామరాజు, కాంచన, జియా శర్మ, సంజయ్ స్వరూప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా తెలుగు రాకపోయినా ఈ సినిమాలో తన పాత్రకు తానే స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. అలా మొత్తానికైతే ఎప్పటికప్పుడు తన టాలెంట్ తో ఆకట్టుకుంటున్న శాలిని పాండే ఇప్పుడు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది.