అట్లీ అనుభ‌వించిన ఒకే చిత్రం!

థియేట్రికల్ అనుభవం గురించి మాట్లాడుతూ.. తాను థియేటర్‌లో ఎప్పుడూ అనుభవించని అడ్రినలైన్ రష్ ..ఇమ్మర్సివ్ ఫోర్స్‌ను ఈ సినిమా ద్వారా అనుభవించానన్నారు.

Update: 2026-08-19 19:30 GMT

ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ `ది ఒడిస్సీ` సినిమాపై కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమాను తాను థియేటర్‌లో అనుభవించిన తీరు గురించి చెబుతూ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన భావోద్వేగ నోట్‌ను పంచుకున్నారు. సాధారణంగా మనం సినిమాలను చూస్తామని.. కొన్నింటిని మెచ్చుకుంటామని...కానీ కొన్ని సినిమాలు మాత్రం మనల్ని పూర్తిగా వేరే లోకానికి తీసుకువెళ్తాయని అట్లీ పేర్కొన్నారు. `ది ఒడిస్సీ` తనకు అలాంటి అద్భుతమైన అనుభూతినే అందించింద‌న్నారు.

ఈ చిత్రంలో నోలన్ నరేషన్ విధానం ఎంతో ఆశ్చర్యకరంగా ఉందని అట్లీ అభిప్రాయపడ్డారు. సినిమాలో ప్రతీ విజువల్ ప్రత్యేకమైన భాషను కలిగి ఉంటుందని.. కెమెరా దృశ్యాలను చూపడమే కాకుండా కథలో మరో పాత్రలా ప్రయాణిస్తుందని తెలిపారు. అలాగే లూడ్విగ్ అందించిన సంగీతం సినిమా నేపథ్యానికి మాత్రమే పరిమితం కాలేదు. చూసేవారి రక్తంలోకి ఇంకిపోతుందంటూ సంగీత దర్శకుడి ప్రతిభను ఆకాశానికెత్తారు.

థియేట్రికల్ అనుభవం గురించి మాట్లాడుతూ.. తాను థియేటర్‌లో ఎప్పుడూ అనుభవించని అడ్రినలైన్ రష్ ..ఇమ్మర్సివ్ ఫోర్స్‌ను ఈ సినిమా ద్వారా అనుభవించానన్నారు. ప్రేక్షకులు తమను తాము పూర్తిగా సినిమాకు అంకితం చేసుకునేలా చేసేదే అసలైన ఎపిక్ సినిమా అని `ది ఒడిస్సీ` సరిగ్గా అదే కోవకు చెందుతుందని అట్లీ అభివర్ణించారు. ఈ సినిమాను చూడటమే కాదు.. దానిని ఒక అనుభవంగా జీవించవచ్చని తెలిపారు.

ఇంకా సినిమా చూడని ప్రేక్షకులకు అట్లీ ఓ సలహా కూడా ఇచ్చారు. ఈ విజువల్ వండర్‌ను కచ్చితంగా ఐమ్యాక్స్ స్క్రీన్లపైనే అనుభవించాలని కోరారు. సినిమా మనల్ని చుట్టుముట్టేలా? మనల్ని పూర్తిగా తనలోకి లాక్కునేలా ఐమ్యాక్స్ అనుభూతి ఉంటుందన్నారు.`కొన్ని సినిమాలు కేవలం చూడటానికి మాత్రమే ఉంటాయి. మరికొన్ని సినిమాలు అనుభవించడానికి మాత్రమే పుడతాయి` అంటూ అట్లీ పోస్టును ముగించారు.

దీంతో `ది ఒడిస్సి`కి మ‌రింత హైప్ క్రియేట్ అవుతుంది. న‌చ్చిన విదేశీ చిత్రాల‌ను ప్రోత్స‌హించ‌డంలో టాలీవు డ్...కోలీవుడ్ డైరెక్ట‌ర్లు ఎప్పుడూ ముందుంటారు. కంటెంట్..మేకింగ్ న‌చ్చిందంటే? ఆ చిత్రాన్ని నిర్మొహ మాటంగా ఆకాశానికి ఎత్తేస్తారు. ఇలాంటి సినిమాల విష‌యంలో ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి కూడా అంతే ఉత్సాంహం గా మాట్లాడుతుంటారు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు దిగ్గ‌జ ద‌ర్శ‌కులు పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. వార‌ణాసిని రాజ‌మౌళి 120 దేశాల్లో రిలీజ్ చేస్తుంటే? ఆ సినిమా ఫ‌లితం చూసి రాకాను అంత‌కు మించి భారీ ఎత్తున రిలీజ్ చేయాల‌ని అట్లీ ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News