మెగాస్టార్ చిరంజీవి మెగా 158 క్రేజీ అప్‌డేట్: లాక్ అయిన ఫస్ట్ హాఫ్ ఎడిట్!

ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను అత్యంత వేగంగా పూర్తి చేసుకుంది. దాదాపు 40 రోజుల పాటు సాగిన సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్ విజయవంతంగా ముగిసింది.

Update: 2026-08-19 22:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలతో అలరించిన అన్న‌య్య‌ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక 158వ సినిమాను ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి వచ్చిన క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను అత్యంత వేగంగా పూర్తి చేసుకుంది. దాదాపు 40 రోజుల పాటు సాగిన సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్ విజయవంతంగా ముగిసింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివే శాలతో పాటు ఓ భారీ యాక్షన్ బ్లాక్‌ను కూడా బాబీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని.. హాలీవుడ్ స్థాయి స్టాండర్డ్స్‌లో డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ మరో కీలకమైన అడుగు ముందుకు వేశారు. 40 రోజుల షూటింగ్ పూర్త‌యినా? సిని మాలోని ఫస్ట్ హాఫ్ ఎడిట్ ను చిత్ర యూనిట్ విజయవంతంగా లాక్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఎడిటింగ్ పనులను కూడా సమాంతరంగా పూర్తి చేయడం బాబీ ప్లానింగ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. ఇలా చేయడం వల్ల సినిమా అవుట్‌పుట్ ఎంత పక్కాగా వస్తుందో? ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ చిత్రంలో చిరంజీవి గెటప్ .. క్యారెక్టరైజేషన్ ఎంతో విభిన్నంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. బాబీ తనదైన శైలిలో కమర్షియల్ హంగులతో పాటు బలమైన భావోద్వేగాలను కథలో జోడించారు. `వాల్తేరు వీరయ్య` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి- బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఫస్ట్ హాఫ్ ఎడిట్ లాక్ కావడం చూస్తుంటే? మేకర్స్ సినిమాను ఎంత వేగంగా కచ్చితమైన ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్తున్నారో? అర్థమవుతోంది.

సినిమాకు సంబంధించి మిగిలిన షూటింగ్ భాగం కూడా త్వరలోనే శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన కీలకమైన అప్‌డేట్స్, టైటిల్ ..ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల చేసే అవకాశం ఉంది. మెగా అభిమానుల అంచనాలను ఏమాత్రం తగ్గకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొత్తంగా మెగా 158 ప్రాజెక్ట్ షూటింగ్ ..నిర్మాణ పరంగా వేగంగా అడుగులు వేస్తోంది. 40 రోజుల షూటింగ్ ముగిసి ఫస్ట్ హాఫ్ లాక్ కావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో రిలీజ్ కు ముందే సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News