గూండాలా ఉన్నాడనే సినిమాల్లో రౌడీ వేషాలు!
బాలీవుడ్ లెజెండరీ నటుడు శక్తి కపూర్ గురించి పరిచయం అసవరం లేదు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం ఆయనది.;
బాలీవుడ్ లెజెండరీ నటుడు శక్తి కపూర్ గురించి పరిచయం అసవరం లేదు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం ఆయనది. ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో బాలీవుడ్ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. శక్తి కపూర్ ప్రతి నాయకుడు పోషిస్తున్నారంటే? సినిమాకే అతడి ఐడెంటిటీనే ఓ బ్రాండ్. మోస్ట్ ఐకానిక్ విలన్స్ లో అతడొక్కడు. అతడి ఆహార్యం, నటన సినిమాకే వన్నే తీసుకొచ్చేది. అప్పటి స్టార్ హీరోలంతా శక్తి కపూర్ విలన్ గా నటించాలని పని గట్టుకుని మరీ తీసుకునేవారు.
తెలుగు చిత్రాల్లో కూడా శక్తి కపూర్ నటించారు. 'కలియుగ పాండవులు', 'యుద్దభూమి', 'సాహసం' లాంటి చిత్రాల్లోనూ తనదైన ముద్ర వేసారు. అయితే శక్తి కపూర్ ప్రతి నాయకుడిగా నటించడం తన తల్లిదండ్రులకు ఎంత మాత్రం ఇష్టం లేదని తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా కెరీర్ తొలి నాళ్లలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు. శక్తి కపూర్ నటించిన 'ఇన్ సానియత్ కే దుష్మన్ 'అప్పట్లో పెద్ద విజయం సాధించింది.
ఇందులో శక్తి కపూర్ విలన్ పాత్రతో అలరిస్తాడు. అయితే ఆ సినిమా థియేటర్లో చూడమని శక్తికపూర్ తన తల్లిదండ్రులకు చెప్పాడట. కొడుకు మాట కాదనలేక తల్లిదండ్రులు ఇద్దరు థియేటర్ కు వెళ్లారు. కానీ సినిమా ఆరంభంలోనే శక్తి కపూర్ ఓ అమ్మాయి చున్నీ పట్టుకుని లాగే సీన్ వస్తుంది. ఆ సీన్ చూసి కపూర్ తండ్రికి కోపం తన్నుకొచ్చిందట. చూసింది చాలు వెళ్లిపోదామని చెప్పి థియేటర్ నుంచి బయటకు వచ్చేసారట.
ఇంటికొచ్చిన తర్వాత వాడు బయటే గూండా అనుకున్నాను..సినిమాలో కూడా ఇలాంటి గూండా వేశాలే వేస్తున్నాడా? అని మండిపడ్డారట. ఇలాంటి నీచమైన పనులు ఎలా చేస్తావ్! రౌడీ పాత్రలు మానేసి హేమామాలిని, జీనత్ అమన్ లాంటి వారి పక్కన హీరోగా చేయ్ అని చెడామడా తిట్టేసి బయటకు వెళ్లిపోయారట. ఆ సమయంలో శక్తి కపూర్ కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్దం కాలేదన్నారు. తన ముఖం, ఆహార్యం విలన్ పాత్రలకు సెట్ అవ్వడంతో సినిమాల్లో అవే పాత్రలు వచ్చేవని తన తండ్రికి చెప్పలేకపోయాన్నారు.
వాటిని తిరస్కరించి బయటకు వచ్చేసి మరో పని చేసుకుందామంటే? అంత శక్తి తన దగ్గర లేదని అందుకే పరిశ్రమలో విలన్ గా ఎక్కువ సినిమాలు చేసానని గుర్తు చేసుకున్నారు. విలన్ పాత్రల వల్లే తనకు అంత గుర్తింపు వచ్చిందని..పరిశ్రమ గనుక తని హీరోగా గుర్తించి అలాంటి పాత్రలు ఆపర్ చేస్తే కచ్చితంగా సక్సెస్ అయ్యేవాడిని కాదేమోనన్నారు.