• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ న్యూస్ విన్నారా.....

బిగ్ న్యూస్ విన్నారా.. బిగ్ బాస్ 7లో ష‌కీలా

| బుల్లితెర‌పై బిగ్ బాస్ సంద‌డి గురించి తెలిసిందే. తెలుగు-త‌మిళం-హిందీ-క‌న్న‌డం-మ‌ల‌యాళంలో బిగ్ బాస్ విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది.

By - Tupaki Desk
Update: 2023-08-27 16:45 GMT

బుల్లితెర‌పై బిగ్ బాస్ సంద‌డి గురించి తెలిసిందే. తెలుగు-త‌మిళం-హిందీ-క‌న్న‌డం-మ‌ల‌యాళంలో బిగ్ బాస్ విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. ఇక తెలుగు నాట నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజ‌న్ 6 విజ‌య‌వంతంగా పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి బిగ్ బాస్ 7 కి రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఇంటి స‌భ్యులు ఎవ‌రు? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. ర‌క‌ర‌కాల పేర్లు తెర‌పైకొస్తున్నాయి.

తాజా స‌మాచారం మేర‌కు.. తెలుగు బిగ్ బాస్ 7లో ఈసారి శృంగార చిత్రాల నాయ‌కిగా ప‌రిచ‌యం ఉన్న మ‌ల‌యాళ‌ నటి షకీలా ప్రవేశించనుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. నిజానికి ప్ర‌తిసారీ బిగ్ బాస్ తెలుగు ప్రారంభానికి ముందు ఇంటిలోకి ష‌కీలా ప్ర‌వేశం ఉంటుంద‌ని ప్ర‌చారం సాగింది. కానీ అది ఇప్ప‌టివ‌ర‌కూ సాధ్య‌ప‌డ‌లేదు. ఇరుగు పొరుగున అవ‌కాశాలొచ్చినా కానీ తెలుగు బిగ్ బాస్ లో ఛాన్స్ ద‌క్కించుకోలేక‌పోయింది.

నిజానికి శృంగార‌ సినిమాల‌తో మలయాళ ప‌రిశ్ర‌మ‌ను ద‌శాబ్ధాల పాటు ఏలిన ష‌కీలా కాల‌క్ర‌మంలో రెగ్యుల‌ర్ చిత్రాల న‌టిగా రూపాంత‌రం చెందింది. తొలిగా త‌మిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత తెలుగులో తేజ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించింది. సంపూ న‌టించిన‌ `కొబ్బరి మట్ట` చిత్రంలోను ష‌కీలా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ప్రవేశించడం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే త‌న‌ పరిచయ వీడియోను బిగ్ బాస్ టీమ్ రెడీ చేసింద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక ష‌కీలా గతంలోకి వెళితే.. బిగ్ బాస్ త‌న‌కు కొత్తేమీ కాదు. 2014లో బిగ్ బాస్ కన్నడ సీజన్ 2లో క‌నిపించింది. ఇంటి నుంచి నెల రోజుల్లో బ‌య‌ట‌కు వెళ్లింది. తమిళనాడులో అనేక టీవీ రియాల్టీ షోలలో పాల్గొంది. వాటిలో కొన్నిటిని గెలుపొందింది. త‌దుప‌రి తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ లో ఏమేర‌కు ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తుందో వేచి చూడాలి. నిజానికి ష‌కీలాకు తెలుగు యూత్ లోను భారీ ఫాలోయింగ్ ఉంది. ఒక ప్ర‌ముఖ తెలుగు హీరో ష‌కీలా అంటే ప‌డి చ‌చ్చిపోయేవాడ‌న్న విష‌యాన్ని ష‌కీలా ఆటోబ‌యోగ్ర‌ఫీలో ప్ర‌స్థావించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ హీరో పేరును మాత్రం ప్ర‌స్థావించ‌లేదు.

Tags:    
  • Shakeela 
  • Biggboss7 
  • Nagarjuna 
  • Movienews 

Similar News

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

Copyright @2026

Powered by Blink CMS