బిడ్డల కోసం స్టార్ హీరో ఆరాటం!
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా పక్కనబెట్టేరు. సెట్స్ కు వెళ్లిన తర్వాత అనివార్య కారణాలతో హోల్డ్ లో పడింది.;
ఇండస్ట్రీకి వారసులు ఎంట్రీ ఇస్తున్నారంటే? ఎన్నో అంచనాలుంటాయి. వాటిని సక్సెస్ చేయడం కోసం వారసులు అంతే శ్రమిస్తారు. కానీ వాళ్లలో అందరూ సక్సెస్ కాలేరు. కొందరికి మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుం ది. ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చినప్పుడే సాధ్యమవుతుంది. కానీ ఈ ప్రాసస్ లో తనయుల కోసం తండ్రులు బ్యాకెండ్ లో చేయాల్సిందల్లా చేస్తుంటారు. కానీ బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ మాత్రం తనయులిద్దరి విషయంలో అంతకు మించి అనిపిస్తున్నారు. కుమార్తె సుహానా ఖాన్ `కింగ్` సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
ఇమేజ్ ని సైత లెక్క చేయకుండా:
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా పక్కనబెట్టేరు. సెట్స్ కు వెళ్లిన తర్వాత అనివార్య కారణాలతో హోల్డ్ లో పడింది. ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో సుహానా ఖాన్ నటిస్తుంది. షారుక్ పాత్ర విషయంలో ఇంత వరకూ సరైన క్లారిటీ లేదు. ఆయన హీరోనా? కీలక పాత్ర? అన్నది తెగని అంశంగా మారింది. ఏదీ ఏమైనా తనయ సినిమా కావడంతో ఆయన ఇమేజ్ ని సైతం పక్కన బెట్టి ముందుకొచ్చి చేస్తోన్న చిత్రంగా నెట్టింట హైలైట్ అవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఆగడానికి కారణం కూడా కథలో పర్పెక్షన్ మిస్ అవ్వడంతోనే 2027 వరకూ వాయిదా వేయించినట్లు మరోవైపు ప్రచారంలో ఉంది.
తనయ కోసం సీరియస్ గా:
అంటే కుమార్తె డెబ్యూ విషయంలో షారుక్ ఎంత సీరియస్ గా ఉన్నారు? అన్నది అద్దం పడుతోంది. మరోవైపు తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా బాలీవుడ్ కి పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. అభిమానుల ంఅచనాలు తల్లకిందులు చేస్తూ ఆర్యన్ ఖాన్ హీరోగా కాకుండా దర్శకుడిగా లాంచ్ అవుతున్నాడు. `ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` పేరుతో ఓసిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. దీన్ని స్వయంగా షారుక్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ పైనే నిర్మిస్తున్నారు.
నిద్రలేని రాత్రుళ్లు గడుపుతోన్న స్టార్:
లక్ష్య, సహేర్, బాబి డియోల్, మనోజ్ పహ్వా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఇదే సిరీస్ లో షారుక్ ఖాన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇంత వరకూ షారుక్ పేరు నిర్మాతగానే వినిపించింది. తాజాగా నటుడిగానూ తెరపైకి రావడంతో తనయుడి ప్రాజెక్ట్ విషయంలోనూ షారుక్ ఎంత శ్రద్దగా ఉన్నారన్నది అద్దం పడుతుంది. అటు తనయ..ఇటు తనయుడు కోసం షారుక్ ఖాన్ నిద్రలేని రాత్రుళ్లే గడుపుతున్నారు.