టాలీవుడ్ 'ఫోర్' పిల్లర్స్ ఎక్కడ? ఎందుకు రాలేదు?

అవును నిజమే.. మోహన్ బాబు రీసెంట్ గా ఏర్పాటు చేసిన పార్టీకి చిరు, బాలయ్య, నాగ్, వెంకీ అటెండ్ అవ్వలేదు. హైదరాబాద్ లో శనివారం నైట్ గ్రాండ్ గా వేడుక నిర్వహించగా.. ఆ నలుగురూ కూడా కనిపించలేదు.;

Update: 2025-11-23 08:18 GMT

టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్.. అదేనండీ నలుగురు సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. వీరందరినీ తెలుగు సినీ ఇండస్ట్రీకి స్తంభాలుగా వర్ణిస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే నలుగురుకు నలుగురే. ఎవరికి వారే స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. తమకుంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని దూసుకుపోతున్నారు.

అయితే ఆ నలుగురు ఇప్పుడు ఓ ఈవెంట్ కు మిస్ అవ్వడం.. సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరు ఎందుకు మిస్ అయ్యారో కారణం ఉన్నా కూడా.. నలుగురూ రాకపోవడంతో అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు రాలేదోనని డిస్కస్ చేసుకుంటున్నారు. అది ఏ ఈవెంట్ అంటే.. సీనియర్ హీరో మోహన్ బాబు పార్టీ.

అవును నిజమే.. మోహన్ బాబు రీసెంట్ గా ఏర్పాటు చేసిన పార్టీకి చిరు, బాలయ్య, నాగ్, వెంకీ అటెండ్ అవ్వలేదు. హైదరాబాద్ లో శనివారం నైట్ గ్రాండ్ గా వేడుక నిర్వహించగా.. ఆ నలుగురూ కూడా కనిపించలేదు. ఆహ్వానం అందినట్లు తెలుస్తున్నా.. ఎందుకు ఆ నలుగురు రాలేదని ఇప్పుడు అంతా డిస్కస్ చేసుకుంటున్నారు!

అందుకు ముఖ్య కారణం షూటింగ్సే. నిజానికి హీరోల షూటింగ్స్ ముందే షెడ్యూల్ అయ్యి ఉంటాయి. ప్రస్తుతం చిరంజీవి.. మన శంకర వరప్రసాద్ గారు మూవీని కంప్లీట్ చేస్తున్నారు. వెంకటేష్ కూడా ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన కూడా ఇప్పుడు ఆ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారని టాక్.

అదే సమయంలో బాలకృష్ణ.. ఇప్పుడు అఖండ-2 ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. రీసెంట్ గా కర్ణాటకలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లి వచ్చారు. నాగార్జున ఏమో.. రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ వీకెండ్ ఎపిసోడ్ తో బిజీగా ఉన్నారు. దీంతో నలుగురు.. తమ తమ ప్రాజెక్టుల హడావుడిలో మునిగితేలుతున్నారని చెప్పాలి.

అందుకే మోహన్ బాబు ఇచ్చిన పార్టీకి అటెండ్ అవ్వలేదని సమాచారం. అయితే ఆయన రీసెంట్ గా ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. అంతటి మైల్ స్టోన్ ను సాధించిన ఆయన.. ఓ భారీ ఈవెంట్ ను నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆ డిసెషన్ ను కొన్ని కారణాల వల్ల పక్కన పెట్టేశారు. అందుకే వరుసగా పార్టీలు ఇస్తున్నారు. అందులో భాగంగా నిన్న టాలీవుడ్ సెలబ్రిటీల కోసం స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News