సీతమ్మ మెరుపులు కుర్రాళ్ల మురిపాలు!
గుండెల్లో అలజడి రేపుతుంది. మృణల్ న్యూ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.;
"ఎంత అందంగా ఉన్నావో ఎవరే నువ్వు? నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు.. నా కన్నులోనా నీరూపం.. నాకన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి.. అ అనుభవమే నాకు తొలిసారి అంటూ ఓ పాట అందుకో వాల్సిందే ఈ ఫోటో చూసిన తర్వాత. అవును మృణాల్ ఠాకూర్ అలియాస్ సీతమ్మ ఇక్కడ అంత అందంగా అనిపిస్తుంది. గుండెల్లో అలజడి రేపుతుంది. మృణల్ న్యూ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
అందులో అమ్మడు అందమైన ముఖమే హైలైట్ అవుతుంది. రంగు ఛామన ఛాయ అయినా ఆ బ్యూటీ సంథింగ్ స్పెషల్ ఉందనిపించలే! అమ్మడి అందమంతా ఆ కళ్లలోనే దాగి ఉందనిపిస్తుంది. ఎత్తైన కనుబొమ్మలు... ఆ కళ్లకు అద్దిన ఐటెక్స్.. దొండ పండు లాంటి పెదాలు ఆద్యంతం అమ్మడివైపు అలా ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా సొగసరి మ్యాకప్ అయిన విధానం...ఎంపిక చేసుకున్న యాక్సరసీస్ ..స్కిన్ టోన్ ప్రతీది మృణాల్ ని మరింత అందంగా తీర్చిదిద్దాయి.
ఈ ఫోటోని ఉద్దేశించి అమ్మడు ఓ పోస్ట్ కూడా చేసిందండోయ్. `మీ హృదయం మెరిసిపోనివ్వండి` ఓ క్యాప్షన్ ఇచ్చింది. అక్కడలా అమ్మడు అందంతా మెరిపిస్తుంటే...దాన్ని చూసి కుర్రాళ్లలో మురిసిపోవాలి అన్న మాట. ఇప్పటివరకూ మృణాల్ నుంచి ఎన్నో ఫోటోలు ఇన్ స్టాలో వైరల్ అయ్యాయి. కానీ వాటన్నిటికి భిన్నంగా ఈ కొత్త ఫోటో యూత్ ని ఆకర్షిస్తుంది. ప్రిన్సెస్ అందాన్ని ఓ రేంజ్ లో పొగిడేస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇక అమ్మడి కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సీతారామం తర్వాత ఇటీవలే హాయ్ నాన్నతో మరో హిట్ అందుకుంది. మరో విజయం కూడా ఖాతాలో చేరితో హ్యాట్రిక్ అవుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో `ఫ్యామిలీ స్టార్` లోనూ నటిస్తోంది. కొన్ని కొత్త ఛాన్సులు క్యూలో ఉన్నాయి. బాలీవుడ్ లోనూ బిజీగా ఉంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలకు జోడీగానూ అవకాశాలు వస్తున్నాయి.