సంక్రాంతి పోటీ.. తప్పుకునేదెవరు?

ఏడాది చివర్లోకి వచ్చేశాం. కొత్త ఏడాది మొదలవడానికి ఎక్కువ సమయం లేదు. సినిమాల పరంగా అత్యంత ముఖ్యమైన సంక్రాంతి సీజన్‌ ఇంకో నాలుగు వారాల్లోపే మొదలైపోతుంది.;

Update: 2025-12-14 12:58 GMT

ఏడాది చివర్లోకి వచ్చేశాం. కొత్త ఏడాది మొదలవడానికి ఎక్కువ సమయం లేదు. సినిమాల పరంగా అత్యంత ముఖ్యమైన సంక్రాంతి సీజన్‌ ఇంకో నాలుగు వారాల్లోపే మొదలైపోతుంది. ఆ పండక్కి ఎప్పుడూ గట్టి పోటీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి పోటీ నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉండే సంకేాతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రేసులో ఉన్న సినిమాల సంఖ్య ఏడు కావడం విశేషం. ప్రతి సంవత్సరం మూడు లేదా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తుంటాయి. వాటికే థియేటర్లు సర్దుబాటు చేయడం చాలా కష్టమవుతుంది.

అలాంటిది ఏడు సినిమాలకు స్క్రీన్లు, షోలు సర్దుబాటు చేయడమంటే అంత తేలిక కాదు. డబ్బింగ్ సినిమాలైన జననాయకుడు, పరాశక్తి సినిమాల గురించి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జననాయకుడు జనవరి 9న ‘రాజాసాబ్’తో పాటు రిలీజవుతుంది. 12న ‘మన శంకర వరప్రసాద్’ వచ్చేలోపు మూడు రోజుల రన్ సరిపోతుందా చిత్రానికి. ‘పరాశక్తి’ 14న రిలీజ్ కావాల్సి ఉంది. తెలుగు రిలీజ్ నామమాత్రంగానే ఉండొచ్చు. ఆ చిత్రాన్ని వారం ఆలస్యంగా విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు.

తెలుగు సినిమాల వరకు చూసుకుంటే ఐదు చిత్రాలకు థియేటర్లు సర్దుబాటు చేయడం అసాధ్యమనే చెప్పాలి. కాబట్టి వీటిలో ఒకటి లేదా రెండు సినిమాలు రేసు నుంచి తప్పుకోవాల్సిందే. చిరంజీవి సినిమా 100 పర్సంట్ చెప్పిన డేటుకే వస్తుంది. కానీ ‘రాజాసాబ్’ 9న వస్తుందా రాదా అని కొంచెం అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఆ సినిమా వాయిదా పడితే మిగతా నాలుగు చిత్రాలూ ఏ ఇబ్బందీ లేకుండా రిలీజైపోతాయి. ‘రాజాసాబ్’ వచ్చేట్లయితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి చిత్రాల్లో కనీసం ఒక్కటి తప్పుకోవాల్సిందే.

రెండు చిత్రాలు పోటీ నుంచి వైదొలిగినా ఆశ్చర్యం లేదు. ‘రాజాసాబ్’ ఏమైనా వాయిదా పడుతుందేమో అన్న ఆశతో.. అలాగే థియేటర్లు ఏమేర లభిస్తాయో చూద్దామని ప్రస్తుతానికి అన్ని సినిమాలూ రేసులోనే ఉన్నాయి. ఎవరి స్థాయిలో వాళ్లు లాబీయింగ్ చేస్తున్నారు. చివరికి ఓ మోస్తరు సంఖ్యలో కూడా స్క్రీన్లు, షోలు దక్కకపోతే పోటీలో ఉన్న మూడు మిడ్ రేంజ్ తెలుగు చిత్రాల్లో ఒకటి లేదా రెండు తప్పుకోవడం ఖాయం.

Tags:    

Similar News