ఫస్ట్ లుక్ చూసి హీరోని గుర్తుపట్టగలరా?

ఇక నెక్స్ట్ రకరకాల ప్రయత్నాలు చేసి ఫైనల్ గా మళ్లీ సత్యదేవ్ తోనే రావు బహదూర్ సినిమా చేస్తున్నాడు.;

Update: 2025-08-12 07:37 GMT

టాలెంటెడ్ యాక్టర్ కి టాలెంటెడ్ డైరెక్టర్ తోడై ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ తో చూశాం. మళ్లీ అదే కాంబోలో మరో క్రేజీ సినిమా ఈసారి చాలా పెద్ద ప్లానింగ్ తో వస్తున్నారు. ఇంతకీ ఎవరా డైరెక్టర్, హీరో అంటే ఇంకెవరు మన సత్యదేవ్ ఇంకా వెంకటేష్ మహా అని తెలుస్తుంది. కేరాఫ్ కంచెరపాలం అనే సినిమాతో తన మార్క్ చూపించాడు వెంకటేష్ మహా. ఆ తర్వాత ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య కూడా ఇచ్చాడు. అది కూడా మంచి సక్సెస్ అందుకుంది.


సత్యదేవ్ తోనే రావు బహదూర్..

ఇక నెక్స్ట్ రకరకాల ప్రయత్నాలు చేసి ఫైనల్ గా మళ్లీ సత్యదేవ్ తోనే రావు బహదూర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఏ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. ఈ మూవీని జి.ఎం.బి మూవీస్ బ్యానర్ లో మహేష్ సమర్పకుడిగా ఉంటున్నారు. జి.ఎం.బి బ్యానర్ నుంచి ఇదివరకు అడివి శేష్ మేజర్ సినిమా వచ్చింది. ఆఫ్టర్ మేజర్ రావ్ బహదొర్ కి మహేష్ బ్యాక్ సపోర్ట్ అందిస్తున్నారు.

ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ నిన్న రిలీజ్ చేసి క్యూరియాసిటీ పెంచగా నేడు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు మేకర్స్. ఈ పోస్టర్ లో సత్యదేవ్ ఓల్డ్ గెటప్ లో అసలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. నెమలి అభరణంతో ఒంటి నిండా బంగారం తో సత్యదేవ్ లుక్ అదిరిపోయింది. తప్పకుండా ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుందనిపిస్తుంది. ఆల్రెడీ ఊమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకటేష్ మహా, సత్యదేవ్ కాంబోలో రావు బహదూర్ వస్తుంది.

వెంకటేష్ మహా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్..

ఫస్ట్ లుక్ అయితే ఇంప్రెస్ చేసింది. ఇక సినిమా కథ మిగతా విషయాలు ఎలా ఉంటాయన్నది చూడాలి. వెంకటేష్ మహా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తో వస్తున్నాడు కాబట్టి కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సత్యదేవ్ కూడా ఈమధ్యనే కింగ్డం తో అదరగొట్టాడు. ఆ సినిమాలో తన పోర్షన్ వరకు ది బెస్ట్ అనిపించాడు సత్యదేవ్. ఇక రావు బహదూర్ తో సత్యదేవ్ మెమొరబుల్ హిట్ కొడతాడేమో చూడాలి.

ఫస్ట్ లుక్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు వెంకటేష్ మహా. ప్రతిభ గల దర్శకుడు కాబట్టి పోస్టర్ తోనే ఇలా ఒక వైబ్ తెచ్చాడంటే కచ్చితంగా సినిమాను నెక్స్ట్ లెవ్ల్ లో తెరకెక్కించే ఛాన్స్ ఉంది. ఈ సినిమా టీజర్ ని ఆగష్టు 18న థియేటర్ లో, డిజిటల్ లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది.

Tags:    

Similar News