కాజల్ 'సత్యభామ'.. న్యూ టార్గెట్ ఫిక్స్!

ఇక ఇప్పుడు జూన్ 7న గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా పోస్టర్ ద్వారా తెలియజేశారు.

Update: 2024-05-23 07:48 GMT

కాజల్ అగర్వాల్ తన కెరీర్ లో మరో డిఫరెంట్ యాంగిల్ లో క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రల్లో మెప్పించిన ఆమె, ఈసారి "సత్యభామ"లో యాక్షన్ క్వీన్ రోల్ లో కనిపించనుంది. ఈ చిత్రం ద్వారా కాజల్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవుతుంది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో, శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

 

కాజల్ సత్యభామ పాత్రలో భిన్నమైన షేడ్స్ తో చాలా అద్భుతంగా ప్రదర్శించిందని ఇదివరకే టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. ఆమె ఏసీపీ సత్యభామ పాత్రలో కనిపిస్తుంది. ఆమె కళ్ళ ముందే హత్యకు గురైన అమ్మాయి కేసును ఎలా చెందించింది? ఉన్నతాధికారులు ఈ కేసు నుంచి సత్యభామను తప్పించినప్పటికి.. ఆ హత్యకేసును చేధించడానికి తన వేటను ఎలా ప్రారంభిస్తుంది.. అనే అంశాలు సినిమాపై అంచనాలను పెంచాయి.

ఇక ఈ సినిమాను మే చివరలోనే విడుదల చేయాలని అనుకున్నారు. అయితే పలు కారణాల వలన డేట్ ను మార్చాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు జూన్ 7న గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ పోస్టర్ లో కాజల్ అగర్వాల్ ఏసీపీ సత్యభామ పాత్రలో కనిపిస్తుంది. ఆమె పోలీస్ యూనిఫారంలో, పట్టుగా గన్ పట్టుకొని, సీరియస్ లుక్ తో యాక్షన్ మోడ్ లో ఉంది.

కాజల్ చుట్టూ తీవ్ర ఘర్షణ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది, అనేక మంది పడిపోయారు. కాజల్ శత్రువులపై ధైర్యంగా ఎదుర్కొనే సన్నివేశం తరహాలో ఉంది. పోస్టర్ లో జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల అని ప్రకటించారు, ఇది ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచుతుంది. కాజల్ అగర్వాల్ మునుపెన్నడూ లేనంతగా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఆమె బాడీ లాంగ్వేజ్, స్టైల్, యాక్షన్ సన్నివేశాలు ఈ పాత్రకు మరింత బలం చేకూరుస్తాయని.. టీజర్ లోనే ఆమె తన నటన అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తుండగా, శశికిరణ్ తిక్కా సమర్పిస్తున్నారు. "సత్యభామ" పూర్తిగా ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. ఈ చిత్రం ద్వారా కాజల్ అగర్వాల్ తన కెరీర్ లో కొత్త రికార్డులు సాధించాలని చూస్తోంది.

Tags:    

Similar News