ఆ సినిమా వ్యసనమైపోయింది
కానీ హీరో సత్య దేవ్ మాత్రం తాను బాధలో ఉన్నప్పుడు సలార్ సినిమా చూస్తానని, ఎందుకనేది తనక్కూడా తెలియదని చెప్పారు.;
ఎవరైనా సరే బాధగా ఉంటే ఆ బాధ నుంచి బయటకు రావడానికి పలు మార్గాలను ఎంచుకుంటారు. కొందరు మంచి మ్యూజిక్ వింటే, మరికొందరు ధ్యానం చేస్తారు. ఇంకొందరు వేరే వేరే వ్యాపకాలను ఎంచుకుంటూ ఉంటారు. కానీ హీరో సత్య దేవ్ మాత్రం తాను బాధలో ఉన్నప్పుడు సలార్ సినిమా చూస్తానని, ఎందుకనేది తనక్కూడా తెలియదని చెప్పారు.
అరేబియన్ కడలితో ప్రేక్షకుల ముందుకు..
టాలీవుడ్ లో ఎంతో టాలెంట్ ఉన్న యంగ్ నటుల్లో సత్యదేవ్ కూడా ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగల సత్యదేవ్, ప్రతీ సినిమాకీ కొత్తదనం చూపిస్తూ నటుడిగా ఆడియన్స్ ను అలరిస్తూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‌డమ్ సినిమాలో విజయ్ కు అన్న పాత్రలో నటించి మెప్పించిన సత్యదేవ్ ఇప్పుడు అరేబియా కడలి సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ ప్రమోషన్స్ లో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు సత్యదేవ్.
సలార్ చూస్తే మామూలైపోతా
సలార్ సినిమా చూడటం వల్ల వెంటనే తన మానసిక స్థితి మారిపోతుందని, బహుశా ఆ సినిమాలోని మ్యూజిక్ వల్ల అవొచ్చు, లేదంటే ఆ సినిమాలో నటించిన ప్రభాస్ అన్న వల్ల అయినా అయుండొచ్చని, లేదంటే ఆ సినిమాలోని పవర్‌ఫుల్ సీన్స్ వల్లనో తెలియదు కానీ సలార్ చూస్తే బాధ నుంచి బయటపడతానని, కారణం ఏదైనా సరే తనకు సలార్ ఓ వ్యసనంలా మారిందని చెప్తున్నారు సత్యదేవ్.
సలార్ సినిమా విషయానికొస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. 2023లో రిలీజైన సలార్ ఆ టైమ్ లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను అందుకున్న విషయం తెలిసిందే.