దీపికా పదుకొణెతో 'డ్యూడ్‌' మామ డాన్స్‌..!

ప్రదీప్ రంగనాథన్‌ హీరోగా కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో వచ్చిన 'డ్యూడ్‌' సినిమాకు తమిళ్‌తో పాటు తెలుగులోనూ పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కింది.;

Update: 2025-10-23 12:40 GMT

ప్రదీప్ రంగనాథన్‌ హీరోగా కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో వచ్చిన 'డ్యూడ్‌' సినిమాకు తమిళ్‌తో పాటు తెలుగులోనూ పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కింది. ఈ సినిమలో శరత్‌ కుమార్‌ పోషించిన పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఆయన కామెడీతో పాటు విలనిజం పండించడం ద్వారా ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేశాడు. ఈ మధ్య కాలంలో శరత్‌ కుమార్‌ పోషించిన పాత్రల్లో బెస్ట్‌ పాత్ర అంటూ ప్రశంసలు దక్కాయి. క్లైమాక్స్‌లో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలో పూర్తి స్థాయి పాత్రను పోషించడం ద్వారా శరత్‌ కుమార్‌ డ్యూడ్‌ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించినట్లు అయింది. కీర్తీశ్వరన్‌ ఈ పాత్రను చాలా విభిన్నంగా రాసుకోవడంతో సినిమాకు ప్లస్ అయింది. ఆకట్టుకునే కథ, కథనంతో పాటు హీరో, హీరోయిన్‌ పాత్రలు ఇంకా డ్యూడ్‌ మామ పాత్ర కూడా బాగా పండిందని విడుదల సమయంలో రివ్యూలు వచ్చాయి.

మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో డ్యూడ్‌..

మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ దక్కించుకోవడంతో పాటు భారీ వసూళ్లు సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. సక్సెస్ మీట్‌లో ప్రదీప్‌ రంగనాథన్‌తో పాటు ఇతర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. చెన్నైలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో నిర్మాతలు మాట్లాడుతూ తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటికీ సూపర్‌ హిట్‌ టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతుందని, తాము నిర్మించిన ఈ తమిళ ప్రాజెక్ట్‌కు ఈ స్థాయి ఆధరణ లభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముందు ముందు తమిళ్‌లో మరిన్ని సినిమాలు తమ బ్యానర్‌లో రావడానికి ఈ సినిమా విజయం దోహద పడుతుందని ఈ సందర్భంగా నిర్మాతలు చెప్పుకొచ్చారు.

డ్యూడ్‌ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా

సినిమా షూటింగ్‌ సమయంలో చాలా జాలీగా టైం సాగిందని హీరోయిన్‌ మమిత బైజు అన్నారు. డ్యూడ్‌ సినిమా షూటింగ్‌కి వెళ్తున్నాము అంటే చాలా సంతోషంగా ఉండేది, డ్యూడ్‌ సినిమా షూటింగ్‌కి వెళ్లిన ప్రతి రోజు ఉత్సాహంగా సాగేదని పేర్కొంది. డ్యూడ్‌ సినిమా షూటింగ్‌ మొత్తం చాలా సరదాగా సాగిందని మమిత పేర్కొంది. తనకు ఈ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసింది. దర్శకుడు కీర్తీశ్వరన్‌ ఈ సినిమాలో తన పాత్రను డిజైన్‌ చేసిన తీరు బాగుండటంతో ఈ రోజు తాను ప్రేక్షకుల అభిమానం దక్కించుకుంటున్నాను, అంతే కాకుండా ఈ సినిమా తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచి పోతుందని మమిత ఆనందం వ్యక్తం చేసింది. మరో విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హీరో ప్రదీప్ రంగనాథన్‌ కృతజ్ఞతలు తెలియజేశాడు.

ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా

ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ... ఈ సినిమాను దర్శకుడు చక్కని మెసేజ్‌తో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాడు. తాను ఈ సినిమాలో పోషించిన పాత్రకు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం నేను హీరోయిన్‌ దీపికా పదుకొణె తో డ్యూయెట్‌ పాడుతూ డాన్స్ చేసేందుకు కూడా రెడీ అన్నట్లుగా చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇలాంటి మంచి కథను, సెన్సిబుల్‌ సబ్జెక్ట్‌ను నిర్మించేందుకు ముందుకు వచ్చిన నిర్మాతలకు అభినందనలు. వారు చాలా ధైర్యంతో ఈ సినిమాను నిర్మించారు అన్నారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో చాలా ఎంజాయ్ చేశామని, షూటింగ్‌ సమయంలోనే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసం కలిగిందని, అందుకే ఈ సినిమా విడుదల సమయంలో చాలా నమ్మకంగా ఉన్నాను అన్నాడు.

Tags:    

Similar News