సారా అర్జున్ రేర్ ఫీట్.. విజయ్, ప్రభాస్ ను దాటి మరీ మొదటి ప్లేస్ లో!
కొన్ని సినిమాలు కొంతమంది నటీనటులను ఎక్కడికో తీసుకెళ్తాయి. అప్పటివరకు ఉన్న క్రేజ్, మార్కెట్ ను తాము నటించిన కొన్ని సినిమాలు విపరీతంగా పెంచుతాయి.;
కొన్ని సినిమాలు కొంతమంది నటీనటులను ఎక్కడికో తీసుకెళ్తాయి. అప్పటివరకు ఉన్న క్రేజ్, మార్కెట్ ను తాము నటించిన కొన్ని సినిమాలు విపరీతంగా పెంచుతాయి. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు ఎంతో మంది నటీనటులకు మంచి పేరు తీసుకురాగా, రీసెంట్ గా వచ్చిన బాలీవుడ్ సినిమా దురంధర్ అందులో నటించిన అందరికీ పెద్ద పేరుని తెచ్చిపెట్టింది.
బాక్సాఫీస్ వద్ద దురంధర్ కలెక్షన్ల సునామీ
రణ్‌వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ గా కొనసాగుతుంది. ఇప్పటికీ దురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించిన సారా అర్జున్ ఇప్పుడందరి దృష్టిని ఆకర్షిస్తూ వార్తల్లోకెక్కారు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ IMDb ట్రెండింగ్ సెలబ్రిటీల లిస్ట్ లో సారా నెం.1 పొజిషన్ ను దక్కించుకుని రికార్డు సృష్టించారు.
IMDb టాప్ ట్రెండింగ్ లిస్ట్ లో సారా నెం.1
ఐఎండీబీ ప్రతీ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ ను అనౌన్స్ చేస్తుంది. ఈ వారం లిస్ట్ లో సారా టాప్ లో నిలిచారు. సారా ఈ లిస్ట్ లో ప్రభాస్, విజయ్ లాంటి పాన్ ఇండియా హీరోలను కూడా వెనక్కి నెట్టి మరీ మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఈ లిస్ట్ లో విజయ్ 8వ స్థానంలో ఉండగా, ప్రభాస్ 19వ స్థానంలో ఉన్నారు. విజయ్, ప్రభాస్ ను సారా దాటి మొదటి స్థానం దక్కించుకోవడానికి కారణం దురంధర్ లో సారా చేసిన యాలినా జమాలి పాత్ర అందరినీ ఆకట్టుకోవడమే.
ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయి నటించిన తీరు, రణ్‌వీర్ సింగ్ తో ఆమె కెమిస్ట్రీ, యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ ను మెప్పించాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మూవీ కేవలం నెల రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ టాప్5 ఇండియన్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది.