రామ్ మిరియాల నుంచి మ‌రో ఎన‌ర్జిటిక్ సాంగ్

ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా నుంచి రిలీజైన కంటెంట్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావ‌డంతో మూవీ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫలితాన్ని అందుకుంటుంద‌ని అంద‌రూ ఆశిస్తున్నారు.;

Update: 2025-11-04 10:15 GMT

విక్రాంత్, చాందినీ చౌద‌రి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిర‌స్తు. సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు రైట‌ర్ షేక్ దావూద్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్నారు. న‌వంబ‌ర్ 14న సంతాన ప్రాప్తిర‌స్తు ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, నిర్వి హ‌రిప్ర‌సాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.



 


సంతాన ప్రాప్తిర‌స్తు టైటిల్ సాంగ్ రిలీజ్

ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా నుంచి రిలీజైన కంటెంట్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావ‌డంతో మూవీ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫలితాన్ని అందుకుంటుంద‌ని అంద‌రూ ఆశిస్తున్నారు. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా మేక‌ర్స్ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయ‌గా, ఆ సాంగ్ ను వెర్స‌టైల్ సింగ‌ర్ రామ్ మిరియాల ఆల‌పించారు.

మ్యారీడ్ లైఫ్ స్టైల్ కు అద్దం ప‌ట్టేలా టైటిల్ సాంగ్

టాలీవుడ్ లోని ప‌లు సూప‌ర్ హిట్ సాంగ్స్ ను పాడిన రామ్ మిరియాల సంతాన ప్రాప్తిర‌స్తు టైటిల్ సాంగ్ ను మ‌రింత స్పెష‌ల్ గా పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ టైటిల్ సాంగ్ ప్ర‌స్తుత కాలంలో ఉన్న మ్యారీడ్ లైఫ్ స్టైల్ కు అద్దం ప‌ట్టేలా సాగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు రామ్ మిరియాల సినిమాల్లో పాడిన పాట‌ల‌న్నీ మంచి చార్ట్‌బ‌స్ట‌ర్లుగా నిలిచిన‌వే.

జాతిర‌త్నాలు లో చిట్టి నీ న‌వ్వంటే, డీజే టిల్లులో టిల్లు అన్న డీజే పెడితే, ద‌స‌రాలో ఛ‌మ్కీల అంగీలేసి, బ‌లగంలో ఊరు ప‌ల్లెటూరు, టిల్లూ స్వ్కేర్ లో టికెట్టే కొన‌కుండా, ఆయ్ లో సుఫియానా ఇలా ప్ర‌తీ పాటా సూప‌ర్ హిట్ గా నిలవ‌డంతో పాటూ ఆయా సినిమాల స‌క్సెస్ లో ఆ సాంగ్ కీల‌క‌పాత్ర పోషించాయి. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు సంతాన ప్రాప్తిర‌స్తు టైటిల్ సాంగ్ కూడా చార్ట్‌బ‌స్ట‌ర్ అయి, సినిమా స‌క్సెస్ లో భాగ‌మ‌వుతుంద‌ని అంద‌రూ ఆశిస్తున్నారు. ట్యూన్ అయితే క్యాచీగా బాగానే ఉంది. మ‌రి ఈ సాంగ్ రామ్ మిరియాల గ‌త పాట‌ల స్థాయిలో స‌క్సెస్ అవుతుందో లేదో చూడాలి.


Full View


Tags:    

Similar News