2026 సంక్రాంతి.. ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లేనా?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కచ్చితంగా అప్పుడే తమ సినిమాలు రిలీజ్ అవ్వాలని అంతా కోరుకుంటారు.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కచ్చితంగా అప్పుడే తమ సినిమాలు రిలీజ్ అవ్వాలని అంతా కోరుకుంటారు. అందుకే ముందుగానే బెర్తులు ఖరారు చేసుకుంటారు. కొన్ని అనుకున్నట్లు విడుదల కాగా, మరికొన్ని లాస్ట్ లో తప్పుకుంటాయి. ఇంకొన్ని సడెన్ లో రేసులోకి వస్తుంటాయి.
అయితే ఇప్పుడు 2026 సంక్రాంతి సీజన్ బెర్తుల విషయంలో కొన్ని నెలలుగా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. కానీ దాదాపు క్లారిటీ వచ్చేసినట్లే. మరికొన్ని రోజుల్లో కంప్లీట్ గా ఫిక్స్ అవ్వనున్నట్లు అర్థమవుతోంది. తెలుగు హీరోల సినిమాలు మూడు కాగా.. మరో కోలీవుడ్ మూవీ రిలీజ్ అయ్యేలా రంగం సిద్ధమవుతున్నట్లు టాక్.
పొంగల్ సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నట్లు ఎప్పుడో ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతి సీజన్ లోనే విడుదల అవ్వనుంది. రీసెంట్ గా సమ్మర్ కు వాయిదా వేస్తారని టాక్ వినిపించినా.. అదేం లేదు. కచ్చితంగా పొంగల్ కు రానున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ఆ తర్వాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు మూవీ కూడా పెద్ద పండక్కి రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. నిజానికి చిన్న సినిమా అయినా కంటెంట్ మీద నమ్మకంతో సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. రేసు నుంచి తప్పుకుంటుందని వార్తలు వచ్చినా.. అదేం నిజం కాదు.
ఇక రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. రాజాసాబ్ మూవీ కూడా పొంగల్ కు రిలీజ్ కానున్నట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 5న వాయిదా పడుతుందని టాక్. నిజానికి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా పరోక్షంగా అదే చెప్పారు. త్వరలోనే మేకర్స్.. ఆ విషయాన్ని అధికారికంగా అనౌన్స్మెంట్ చేయనున్నారని వినికిడి.
అయితే సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ వస్తారని ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న మూవీ రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ చిత్రం రేసు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి జన నాయగన్ మాత్రం సంక్రాంతికే రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. తెలుగులోనూ భారీగా రిలీజ్ చేయనున్నారట. మొత్తానికి 2026 సంక్రాంతి లైనప్ దాదాపు ఫిక్స్ అయినట్లే.