2026 సంక్రాంతి.. కడుపు చెక్కలేనా?

టాలీవుడ్లో క్రేజీయెస్ట్ సీజన్ అయిన సంక్రాంతికి.. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్లను రిలీజ్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. ఆ టైంలో సీజన్‌కు తగ్గ సినిమా పడి, దానికి పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుందన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-09-30 23:30 GMT

టాలీవుడ్లో క్రేజీయెస్ట్ సీజన్ అయిన సంక్రాంతికి.. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్లను రిలీజ్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. ఆ టైంలో సీజన్‌కు తగ్గ సినిమా పడి, దానికి పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుందన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టిందంటే అందులో ఫ్యామిలీ ఆడియన్సుని మెప్పించే లక్షణాలుండబట్టే. దీని ముందు సీరియస్ సినిమాలైన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ నిలవలేకపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే వచ్చే సంక్రాంతికి పర్ఫెక్ట్ సీజన్ సినిమాలనే రెడీ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఫిక్స్ అయిన మూడు చిత్రాలూ కామెడీ ప్రధానంగా సాగే ఎంటర్టైనర్లే కావడం విశేషం. కాబట్టి పండక్కి ప్రేక్షకుల కడుపులు చెక్కలవడం గ్యారెంటీ అనిపిస్తోంది.

ముందుగా సంక్రాంతి బరిలో నిలిచిన ‘మన శంకర వరప్రసాద్’ జానరేంటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీనే ప్రధాన ఆకర్షణ. చిరుతో కూడా అతను అలాంటి సినిమానే చేస్తున్నాడు. ఇంకా సినిమా నుంచి టీజర్ రాలేదు కానీ.. అది వచ్చినపుడు కామెడీనే హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. యాక్షన్ టచ్ ఉన్నా సరే.. ఎంటర్టైన్మెంటే ప్రధాన లక్ష్యంగా సినిమా సాగే అవకాశాలున్నాయి. ఇక నవీన్ పొలిశెట్టి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ కూడా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని దాని ప్రోమోలు సంకేతాలు ఇచ్చాయి. ప్రమోషనల్ వీడియోల్లో కూడా ఫన్ జనరేట్ చేయడానికే ప్రయత్నించారు.

ఇక లేటుగా పండుగ రేసులో నిలిచిన ప్రభాస్ సినిమా ‘రాజా సాబ్’ కూడా వినోద ప్రధానంగా సాగబోతోందని అర్థమవుతోంది. ఇందులో హార్రర్ కూడా ఉన్నప్పటికీ.. దాన్ని మించి కామెడీనే హైలైట్ అయ్యేలా ఉంది. హార్రర్ కామెడీలు తీయడంలో మారుతి అందెవేసిన చేయి. ప్రభాస్ అనేసరికి ఇంకా డోస్ పెంచినట్లున్నాడు. వేరే ఆకర్షణలు ఎన్ని ఉన్నా ఇందులో ప్రేక్షకులను నవ్వించడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత కామెడీ చేయడం చూడబోతున్నాం. ఇలా వచ్చే సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ వినోద ప్రధానంగానే సాగేలా ఉండడంతో ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకోవచ్చన్నమాట.

Tags:    

Similar News