30 వేల కోట్ల ఆస్తి తగాదా.. డబ్బు విదేశాలకు తరలిపోయింది!
దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం ఆ ఇంట్లో ఆస్తి తగాదాకు దారి తీసిన సంగతి తెలిసిందే. దాదాపు 30,000 కోట్ల ఎస్టేట్ కి సంబంధించిన గొడవ అంతకంతకు ముదురుతోంది.;
ఇక ప్రియా కపూర్ వ్యవహారంపై మొదటి నుంచి సంజయ్ కపూర్ తల్లిగారైన రాణి కపూర్ చాలా ఆరోపణలు చేస్తున్నారు. తన కుమారుడి ఆస్తులలో తన వాటా తనకు దక్కనీకుండా ప్రియా మోకాలడ్డుతోందని ఆరోపించారు రాణీజీ. ఇప్పుడు సంజయ్ తల్లి రాణి కపూర్ మరోసారి ప్రియా కపూర్‌పై తీవ్ర ఆరోపణలు చేసారు. సంజయ్ సంపాదన గురించి, అతడి ఆస్తుల గురించి ప్రియా బయటపడకుండా దాచేస్తోందని కోర్టుకు వివరాలు చెప్పడం లేదని రాణీ కపూర్ ఆరోపించారు. సంజయ్ రూ.60 కోట్ల జీతం పొందినా.. బ్యాంక్ బ్యాలెన్స్ రూ.1 కోటి కంటే కొంచెం ఎక్కువగా ఉందని ప్రియా చెబుతున్నట్టు వెల్లడించారు. సంజయ్ సంపదను ప్రియా దాచిపెట్టిందని సంజయ్ తల్లి ఆరోపించారు. రాణీ కపూర్ తరపు న్యాయవాది దిల్లీ హైకోర్టులో ఈ ఆరోపణలు చేసారు. ప్రియా కీలకమైన ఆర్థిక వివరాలను దాచిపెట్టిందని ,నిధులను విదేశాలకు బదిలీ చేసి ఉండవచ్చనే అనుమానం ఉందని న్యాయవాది పేర్కొన్నారు.
ఈ పెద్దమనిషికి జీవిత భీమా లేదు.. అద్దె ఆదాయం లేదు.. మ్యూచువల్ ఫండ్లు లేవు! అంటూ ప్రియా కపూర్ ప్రతిదీ దాస్తోందని ఆరోపించారు. అతడికి కోట్లలో ఆదాయం వస్తుంటే వాస్తవాన్ని దాచి పెడుతోందని ప్రియాపై సీరియస్ అయ్యారు. డబ్బు సరిహద్దు దాటి వెళ్లింది.. కట్టడి చేయండి! అని కోర్టుకు విన్నవించారు రాణీజీ. అయితే కుటుంబంలో భర్త ఆస్తులను తన భార్యకు ఇచ్చి వెళ్లడం సాంప్రదాయం.. రాణీజీకి సంజయ్ తండ్రి ఆస్తులను వదిలి పెట్టి వెళ్లారు. అని ప్రియా తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనను జడ్జి తోసి పుచ్చారు.
కపూర్ కుటుంబంలో భర్తలు తమ వ్యక్తిగత ఆస్తులను తమ భార్యలకు వదిలిపెట్టడం సంప్రదాయం అని ప్రియా చేసిన వాదనను కోర్టు జడ్జి కూడా తోసిపుచ్చారు, సంజయ్ తండ్రి గతంలో తన ఆస్తిని రాణి కపూర్‌కు వదిలిపెట్టారని ఆమె ప్రస్తావించారు. అయితే రాణీకపూర్- సంజయ్ తండ్రితో ఇతరులను పోల్చడం కుదరదని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబంర్ 3 నాటికి వాయిదా వేసారు.