బర్త్‌డే స్పెషల్ : సంజూ భాయ్ ఆస్తులు, వ్యాపారాలు గురించి ఈ విషయాలు తెలుసా?
బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేసిన స్టార్ సంజయ్ దత్. ఈయన కెరీర్ ఆరంభంలో హిందీ సినిమాలకు పరిమితం అయ్యారు.;
బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేసిన స్టార్ సంజయ్ దత్. ఈయన కెరీర్ ఆరంభంలో హిందీ సినిమాలకు పరిమితం అయ్యారు. ఆ సమయంలోనూ సంజయ్ దత్ గురించి సౌత్‌లో ప్రముఖంగా చర్చ జరిగేది. ఆయనకు సంబంధించిన కొన్ని వివాదాస్పద విషయాలు, సినిమాలు జాతీయ స్థాయిలో చర్చ జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే ఆయన దేశ వ్యాప్తంగా సుపరిచితుడు అయ్యాడు. ఇప్పుడు ఆయన సౌత్‌లోనూ వరుస సినిమాలు చేస్తున్నాడు. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో ఈయన నటిస్తున్న కారణంగా పాన్ ఇండియా సీనియర్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్ అంటూ ఆయన్ను ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు పిలుస్తున్నారు. ఆయన ఈ వయసులోనూ కొత్త అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు.
రాజాసాబ్ సంజయ్ దత్ లుక్
సంజయ్ దత్ తాజాగా తన బర్త్‌డేను జరుపుకున్నారు. ఆ సందర్భంగా ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజాసాబ్' సినిమాలోని ఆయన లుక్‌ను రివీల్ చేయడం జరిగింది. చనిపోయి దెయ్యంగా మారిన ప్రభాస్ తాత పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. సినిమాకు అత్యంత కీలక పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నాడని ఇప్పటికే మేకర్స్ చెప్పకనే చెప్పారు. ఆ మధ్య ఈయన నటించిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ నిరాశ మిగిల్చినా అందులోని పాత్ర గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. తప్పకుండా సంజయ్ దత్ మరోసారి ఆకట్టుకుంటాడు అనే విశ్వాసంను అభిమానులు, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు విశ్వసిస్తున్నారు. ఆ పాత్ర సంజయ్ దత్ చేయడం వల్ల సినిమా వెయిట్ పెరిగిందని మారుతి పలు సార్లు అన్నాడు.
సంజయ్ దత్ ఆస్తులు, వ్యాపారాలు
కొన్ని కారణాల వల్ల జైలు జీవితం గడిపిన సంజయ్ దత్ ఆస్తుల విషయం చాలా మందికి తెలియదు. ఆయన ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వరుస సినిమాలు చేస్తున్నాడని, సౌత్ సినిమాలు చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందని ఇక్కడ చేస్తున్నాడని అనుకుంటున్నారు. కానీ ఆయన ఆస్తులు వందల కోట్లలో ఉంటాయని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయన కేవలం నటనపై మాత్రమే దృష్టి పెట్టకుండా వ్యాపారాలపైనా దృష్టి పెట్టారు. ఆయన పూర్తి స్థాయిలో వ్యాపారాలు చేయకున్నా సహ భాగస్వామిగా కొన్ని కంపెనీలు, కొన్ని సంస్థలు నడుస్తున్నాయి. వాటి ద్వారా భారీ మొత్తంలో సంజయ్ దత్ సంపాదిస్తున్నాడు అని బాలీవుడ్ వర్గాల వారు అంటూ ఉంటారు. ఆయన లైఫ్ స్టైల్ మాత్రం చాలా సింపుల్‌గా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.
ముంబైలో ఖరీదైన ఆస్తులు
సౌత్‌లో సంజయ్ దత్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. అంతే కాకుండా డాన్ టౌన్, కార్టెల్ అండ్ బ్రదర్స్, సైబర్ మీడియా ఇండియా కంపెనీల్లో సంజయ్ దత్‌కి భాగస్వామ్యం ఉంది. సంజయ్ సొంతంగా ఒక విస్కీ బ్రాండ్‌ను కొనసాగిస్తూ ఉన్నాడు. దానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది, దాని ధర రూ.1500 లు. ముంబైలోని ఖరీదైన ఏరియాలో సంజయ్ దత్‌కి ఆస్తులు ఉన్నాయి. ముఖ్యంగా చాలా ఖరీదైన ఇల్లు ఉంది. దత్ కి దుబాయ్‌లోనూ, మరో రెండు మూడు దేశాల్లోనూ ఆస్తులు ఉన్నాయని టాక్ ఉంది. ఆ విషయమై ఆయన ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. అంతే కాకుండా కోట్ల విలువ చేసే కార్లు తన గ్యారేజ్‌లో ఉన్నాయి.
అభిరుచితో సంజయ్ దత్ సేకరించిన వాచ్ ల ఖరీదు దాదాపుగా రెండున్న కోట్ల నుంచి మూడు కోట్ల వరకు ఉంటుందని బాలీవుడ్‌లో టాక్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే సంజయ్ దత్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఆర్థికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు, నటనపై ఆసక్తితో మాత్రమే ఆయన నటిస్తున్నారు.