BB రాజ్యంలో కమాండర్ ఫైట్.. ఎవరికెన్ని మార్కులు..?

బిగ్ బాస్ సీజన్ 9లో 10వ వారం ఫ్యామిలీ వీక్ అని హౌస్ మేట్స్ గెస్ చేయగా బిగ్ బాస్ వాళ్లకు షాక్ ఇస్తూ బీబీ రాజ్యం టాస్క్ పెట్టాడు.;

Update: 2025-11-12 03:57 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో 10వ వారం ఫ్యామిలీ వీక్ అని హౌస్ మేట్స్ గెస్ చేయగా బిగ్ బాస్ వాళ్లకు షాక్ ఇస్తూ బీబీ రాజ్యం టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ లో భాగంగా కళ్యాణ్ రాజుగా, దివ్య, రీతు మహా రాణులుగా ఫిక్స్ చేసిన బిగ్ బాస్ ఆ ముగ్గురే హౌస్ లో ఉన్న మిగతా వారిలో నలుగురు కమాండర్స్, నలుగురు ప్రజలను ఫిక్స్ చేయమని చెప్పాడు. కళ్యాణ్, దివ్య, రీతు ఒక్కొక్కరిని పిలిచి కమాండర్ గా ఎవరు ఉండాలి.. ప్రజలుగా ఎవరు ఉండాలి అన్నది చర్చించారు.

కమాండర్స్ గా నిఖిల్, డీమాన్ పవన్, తనూజ, సంజన..

ఫైనల్ గా కమాండర్స్ గా నిఖిల్, డీమాన్ పవన్ ని ఫిక్స్ చేసి ఆ తర్వాత ఇద్దరు కమాండర్స్ గా సంజన, తనూజని లాక్ చేశారు. ఈ నలుగురు కమాండర్స్ కి వారి వారి డ్యూటీస్ చెప్పారు కళ్యాణ్ దివ్య రీతు. తనూజ సంజన వంట సరిగా చేయించడం అందరికీ అన్నీ ఉండేలా చేయడం లాంటివి చూడాలి. డీమాన్ ఈ ముగ్గురికి గార్డ్ గా ఉంటాడు. నిఖిల్ సెక్యురిటీగా డ్యూటీ చేస్తుంటాడు. భరణి, ఇమ్మాన్యుయెల్, సుమన్ శెట్టి, గౌరవ్ ప్రజలుగా ఉంటారు.

ఐతే ఈ టాస్క్ లో రాజు, రాణులే కాదు కమాండర్స్ పొజిషన్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది. అది వారికి ఇచ్చే టాస్క్.. వారి పర్ఫార్మెన్స్ ని బట్టి ఉంటుంది. ఐతే ముందుగా కమాండర్స్ నలుగురికి ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. కమాండర్స్ నలుగురు ఎవరి బాస్కెట్ వారి వెనకాల తగిలించుకుని బాల్స్ తమ బాస్కెట్ లో పడకుండా జాగ్రత్త పడాలి. ఐతే ఈ టాస్క్ కి మహారాణి రీతు సంచాలక్ గా ఉంది. ఈ టాస్క్ లో డీమాన్ పవన్ కి రెండుసార్లు ఛాన్స్ ఇచ్చిందని సంజన, నిఖిల్, తనూజ గొడవ చేయగా అందరికీ ఆ ఛాన్సెస్ ఇచ్చింది. ఐతే నిఖిల్ బాస్కెట్ లో 1 బాల్ మాత్రమే ఉన్నా రీతు తనూజని సేఫ్ చేసింది. నిఖిల్ రెండో రౌండ్ కూడా ఆడాల్సి వచ్చింది.

సంజన, సుమన్ చెరో 6 బాక్స్ లు..

ఇక పవన్, నిఖిల్, సంజన రౌండ్ లో పవన్ సేఫ్ అవగా మూడో రౌండ్ లో నిఖిల్, సంజన ఫైట్ లో నిఖిల్ సేఫ్ అయ్యాడు. కమాండర్ ఫైట్ లో లాస్ట్ లో ఉన్న సంజన తన కమాండర్ షిప్ కాపాడుకోవాలంటే మాత్రం ప్రజల్లో ఒకరితో బిల్డింగ్ టాస్క్ ఆడాలని బిగ్ బాస్ చెబుతాడు. దానికి ఆమె సుమన్ శెట్టిని ఎంపిక చేసుకుంటుంది. ఇక ఈ టాస్క్ లో సంజన, సుమన్ చెరో 6 బాక్స్ లు నిలబెడతారు. ఈ టాస్క్ విషయంలో కళ్యాణ్ సంజనని గెలిపిస్తాడు. ఎందుకంటే ఆమె బిల్డింగ్ స్ట్రైట్ గాఉందని చెబుతాడు. ఈ నిర్ణయాన్ని తనూజ, దివ్య తప్పుపడతారు.

ఫైనల్ గా కామాండర్ గా సంజన పోరాడి గెలిచింది. ఈమధ్య ఆమె టాస్క్ లు సరిగా ఆడట్లేదని హౌస్ లో చాలామంది ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఈ బిల్డింగ్ టాస్క్ గెలిచి సత్తా చాటింది సంజన.

Tags:    

Similar News