బిగ్‌బాస్ 9 : అందరూ వ్యతిరేకించడం సంజనకి కలిసి వచ్చింది
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 మొదటి రోజు నుంచే గొడవలతో మొదలైంది. కామనర్స్, సెలబ్రెటీల మధ్య ప్రతి విషయంలోనూ గొడవలు జరుగుతున్నాయి.;
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 మొదటి రోజు నుంచే గొడవలతో మొదలైంది. కామనర్స్, సెలబ్రెటీల మధ్య ప్రతి విషయంలోనూ గొడవలు జరుగుతున్నాయి. ముందు రోజు ఎపిసోడ్‌లో సంజన గుడ్డు దొంగతనం ఇష్యూ కొనసాగుతూనే వచ్చింది. ఆమెను రెండు రోజుల పాటు ఓనర్స్ ఇంట్లోకి అనుమతించేది లేదు అని నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఎపిసోడ్‌లో ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సంజనను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూం కి పిలవడం ద్వారా అందరూ ఆశ్చర్యపోయారు. తాను నిర్మొహమాటంగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతాను అని, ఆ విషయం అందరికీ నచ్చడం లేదు అని బిగ్‌బాస్‌తో సంజన చెప్పింది. అంతే కాకుండా చాలా మంది కంటెస్టెంట్స్ ఇంకా మాస్క్ ధరించి, పైకి మంచితనం నటిస్తున్నారు అంటూ బిగ్‌బాస్‌తో చెప్పేసింది. ఆమె నిజాయితికి బిగ్‌బాస్ మెచ్చి పెద్ద అవకాశం ఇచ్చాడు.
బిగ్‌బాస్ 9 కెప్టెన్సీ టాస్క్
మొదటి బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్ ఎంపికకు సంబంధించిన టాస్క్ కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసే బాధ్యత సంజనకి ఇవ్వడం జరిగింది. ఆమె తన తెలివి అంతా ఉపయోగించి తనకు సన్నిహితులను, పోటీ ఇవ్వలేని వారిని ఎంపిక చేసింది. తన పేరును తాను చెప్పుకోవడంతో పాటు హరీష్, ఇమాన్యూల్, శ్రష్టి, పవన్ పేర్లను కెప్టెన్సీ టాస్క్ కి సంజన ఎంపిక చేసింది, ఆ పేర్లను బిగ్‌బాస్ సూచన మేరకు బయటకు వెళ్లి అందరికీ చెప్పింది. కామనర్స్‌లో కొందరు తమ పేరును ఎందుకు ఎంపిక చేయలేదు అంటూ ప్రశ్నిస్తే, కొందరు మాత్రం తమలో తాము అనుకున్నారు. సెలబ్రిటీలు సైతం తమను ఎంపిక చేయనందుకు కాస్త అసహనం వ్యక్తం చేసినట్లుగా కనిపించారు. మొత్తానికి సంజన ఎంపిక విషయంలో కొద్ది సమయం చర్చ జరిగింది. ఆ తర్వాత కెప్టెన్సీ కి కంటెస్టెంట్స్‌గా నిలిచిన వారికి మద్దతుగా నిలిచే వారిని ఎంపిక చేయడం జరిగింది.
మొదటి కెప్టెన్‌గా సంజన
ఇమాన్యూల్‌కి భరణి, శ్రష్టికి రాము, సంజనకి శ్రీజ, పవన్ కి ప్రియా, హరీష్ కి కళ్యాణ్ సపోర్ట్ చేశారు. వారి సహకారంతో కెప్టెన్సీ టాక్స్‌లో కంటెస్టెంట్స్ గెలుపొందాల్సి ఉంటుంది. టాస్క్ ప్రారంభం అయింది. గురువారం ఎపిసోడ్‌లో టాస్క్ మొదలైంది. కెప్టెన్ ఎవరు అనేది మాత్రం తర్వాత ఎపిసోడ్‌కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పటికే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం సంజన మొదటి కెప్టెన్‌గా నిలిచింది. ఆమె టాస్క్ లో చివరి వరకు ఉండటం ద్వారా బిగ్‌బాస్ సీజన్ 9 ఇంటి మొదటి కెప్టెన్‌గా నిలిచింది. ఆమె ఆట తీరుకు బిగ్‌బాస్ సైతం ప్రశంసలు కురిపించారట. శుక్రవారం ఎపిసోడ్‌లో సంజన కెప్టెన్‌గా నిలిచిన తీరును చూడబోతున్నారు. బిగ్‌బాస్ కొత్త ఇంటి కెప్టెన్‌గా సంజన ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సంజన ముక్కుసూటి తనంతో బిగ్‌బాస్ బిగ్ ఛాన్స్
తన ముక్కుసూటి తనం కారణంగా కెప్టెన్‌గా సంజన కాస్త సీరియస్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సంజన వల్ల తెగ ఇబ్బంది పడుతున్నట్లుగా ఇతర కంటెస్టెంట్స్ కోపంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆమె కెప్టెన్ కావడం అనేది ఇంటి సభ్యుల్లో చాలా మందికి నచ్చే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో ఆమె కెప్టెన్సీకి ఎలా సహకరిస్తారు, అసలు ఆమె కెప్టెన్‌గా ఎలా ముందుకు నెట్టుకు రాగలదు అనేది చూడాలి. సంజన నామినేషన్స్ లో ఉన్నప్పటికీ కెప్టెన్‌గా ఛాన్స్ వచ్చింది. నామినేషన్‌లో ఉన్నప్పుడు కెప్టెన్ అయినంత మాత్రాన సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండవు. కానీ సంజన కంటెంట్ బాగానే ఇస్తున్న కారణంగా ఖచ్చితంగా మంచి ఓటింగ్ పర్సంటేజ్‌ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. హౌస్‌లో చాలా మంది ఆమెను వ్యతిరేకించడం అనేది ఖచ్చితంగా ఆమెకు చాలా ప్లస్ అవుతుంది అని బిగ్‌బాస్ ప్రేక్షకులు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.