మెగా డీల్ సెట్ చేసుకున్న సందీప్ వంగ..?

యానిమల్ మేకర్ సందీప్ వంగ నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది.;

Update: 2025-12-05 04:49 GMT

యానిమల్ మేకర్ సందీప్ వంగ నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఐతే ఈ సినిమా తర్వాత కూడా సందీప్ స్టార్స్ తో భారీ ప్లానింగ్ లోనే ఉన్నాడని తెలుస్తుంది. స్పిరిట్ ని 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు సందీప్ వంగ. యానిమల్ తర్వాత టీ సీరీస్ బ్యానర్ లోనే స్పిరిట్ వస్తుంది. ఇదే కాదు సందీప్ వర్కింగ్ స్టైల్ అతని కాన్ఫిడెన్స్ చూసి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన టీ సీరీస్ సందీప్ వంగాతో 3 సినిమాల అగ్రిమెంట్ చేసుకుందట. యానిమల్ తర్వాత కొత్త అగ్రిమెంట్ చేసుకున్నారట. అందులోనే స్పిరిట్ మొదటి సినిమాగా వస్తుంది.

స్పిరిట్ తర్వాత అల్లు అర్జున్..

అంటే టీ సీరీస్ బ్యానర్ లోనే సందీప్ వంగ నెక్స్ట్ రెండు సినిమాలు ఉండబోతున్నాయి. ఐతే ప్రభాస్ తర్వాత సందీప్ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్స్ అయిన అల్లు అర్జున్, చరణ్, మహేష్ ఉన్నారు. వీరిలో స్పిరిట్ తర్వాత వెంటనే అల్లు అర్జున్ లేదా రామ్ చరణ్ తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ రాజమౌళి వారణాసి తర్వాత మహేష్ కూడా సందీప్ వంగాతోనే సినిమా చేయాలనే ప్లాన్ ఉందట. అందుకే టీ సీరీస్ ఈ డైరెక్టర్ ని వదిలి పెట్టకుండా మూడు సినిమాల మెగా డీల్ సెట్ చేసుకున్నారట. తప్పకుండా ఈ సినిమాలతో టీ సీరీస్ కూడా సెన్సేషనల్ సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

సందీప్ వంగ సినిమాలు వెరైటీగా ఉంటున్నాయి. అర్జున్ రెడ్డితోనే అతని డైరెక్షన్ స్టామినా అర్థమైంది. ఇక యానిమల్ తో బాలీవుడ్ మేకర్స్ ని సైతం షాక్ అయ్యేలా చేశాడు సందీప్ వంగ. ఐతే స్పిరిట్ తో ఈసారి తన మాస్ డైరెక్షన్ తో పాటు ఎమోషన్ ఇంకా స్టైలిష్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడట సందీప్ వంగ. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.

సందీప్ వంగ తెలుగు నిర్మాతలకు దొరకట్లేదు..

స్పిరిట్ తర్వాత కచ్చితంగా సందీప్ తో సినిమాల కోసం బడా నిర్మాణ సంస్థలు క్యూ కడతాయి. ఇప్పటికే అతను ఛాన్స్ ఇస్తే అతనితో సినిమాకు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా రెడీ అనేస్తున్నారు. కానీ సందీప్ వంగ తెలుగు నిర్మాతలకు దొరకట్లేదు. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ టీ సీరీస్ తోనే వరుస ప్రాజెక్ట్ లు సెట్ చేసుకుంటున్నాడు. స్పిరిట్ తో పాటు నెక్స్ట్ రెండు సినిమాలు కూడా అంటే ఒక్కో దానికి రెండేళ్లు తీసుకున్నా సందీప్ వంగ వేరే బ్యానర్ లో సినిమాలు చేయాలంటే మాత్రం మరో ఆరేడేళ్లు వెయిట్ చేయాల్సిందే.

ఐతే సందీప్ వంగ టీ సీరీస్ ప్రొడక్షన్ లో చేస్తున్నా తన బ్రదర్ తో తను సొంతంగా ఏర్పాటు చేసుకున్న భద్రకాళి పిక్చర్స్ కూడా తన సినిమాలకు కో ప్రొడ్యూసర్ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. సో సందీప్ ప్లానింగ్ చూస్తుంటే బాలీవుడ్ లోనే తన ఫోకస్ అంతా పెట్టేలా ఉన్నాడని అనిపిస్తుంది.

Tags:    

Similar News