వంగా స్ట్రాటజీ వేరు.. ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్!

అయితే ఆ సినిమా కూడా ఓ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే అంతా ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా సందీప్ మార్క్.. ఊహించని విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.;

Update: 2025-10-24 07:55 GMT

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు తీసిన సినిమాలు తక్కువే అయినా.. కౌంట్ తో సంబంధం లేకుండా ఫేమ్ సంపాదించుకున్నారు. సందీప్ రెడ్డి వంగా అంటే ఓ స్పెషల్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. మూడు సినిమాలతోనే విశేషమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు.

అర్జున్ రెడ్డితో డైరెక్టర్ గా మారిన ఆయన.. ఆ తర్వాత కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలు తెరకెక్కించారు. ఆ మూడింటితోనో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. యానిమల్ సీక్వెల్ ను ఇప్పటికే లైన్ లో పెట్టిన సందీప్.. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీని రూపొందించనున్నారు. మాస్ పోలీస్ డ్రామాగా తెరకెక్కించనున్నారు.

అయితే ఆ సినిమా కూడా ఓ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే అంతా ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా సందీప్ మార్క్.. ఊహించని విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజానికి ఆయన మేకింగ్ అండ్ టేకింగ్ స్టైలే వేరు. మిగతా డైరెక్టర్స్ కు చాలా భిన్నంగా ఉంటారు. తనదైన శైలిలో సినిమాలు తీశారు.. తీయనున్నారు కూడా..

ఎన్ని విమర్శలు వచ్చినా కొన్నిసార్లు పట్టించుకోరు.. మరికొన్నిసార్లు గట్టి కౌంటర్లు ఇస్తారు. ఏదేమైనా అన్ని విషయాల్లోనూ భిన్నంగా ఉంటారు. సినిమా ప్రమోషన్స్ లో కూడా అంతే. ఈ సారి మళ్లీ అదే ప్రూవ్ చేశారు. నిజానికి నిన్న ప్రభాస్ బర్త్ డే కాగా.. స్పిరిట్ నుంచి అప్డేట్ ఇస్తారని అంతా ఫిక్స్ అయ్యారు. ఈవెనింగ్ కల్లా రివీల్ చేస్తారనుకున్నారు.

సాధారణంగా ఏ మేకర్స్ అయినా అదే చేస్తారు. ముందే మంచి టైమ్ చూసుకుని రిలీజ్ చేసుకుంటారు. కానీ సందీప్ మాత్రం రాత్రి 11 గంటలకు సౌండ్ స్టోరీని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ టైమ్ కు విడుదల చేస్తారని అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అయితే ఎవరూ అంచనా వేయని విధంగా ఉండటం ఆయన ప్రత్యేకత అని తెలిసిందే.

తద్వారా తన లెక్కే వేరు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు సందీప్ వంగా. అయితే లేట్ నైట్ విడుదల చేసినా.. సోషల్ మీడియాలో రీచ్ అవ్వలేదనుకుంటే పొరపాటే. నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆ టైమ్ లో చూసిన సినీ ప్రియులు, ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వైరల్ చేశారు. పొద్దున్నే లేచి చూసేసరికి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ఫుల్ గా కనిపించాయి. దీంతో ఏ టైమ్ కు విడుదల చేస్తే ఏముంది.. కంటెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం కదా.. ఇదే సందీప్ స్ట్రాటజీగా అనిపిస్తోంది.

Tags:    

Similar News