స్పిరిట్ కాదు ఆ తుఫాను హెచ్చరికలు మర్చిపోయారా..?
ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా లైన్లో పెట్టాడు సందీప్ వంగ. ప్రభాస్ తో చేసే సినిమాను కూడా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తో తీసుకొస్తున్నాడని తెలుస్తుంది.;
శివ సినిమాతో సెన్సేషన్ సృష్టించిన ఆర్జీవి తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో ప్రశంసించే డైరెక్టర్ ఎవరంటే అది సందీప్ రెడ్డి వంగ మాత్రమే. అఫ్కోర్స్ రాజమౌళి లెక్క వేరు.. కానీ మొదటి రెండు సినిమాలతోనే ఇలా నేషనల్ లెవెల్ ఇంపాక్ట్ కలిగించడం అన్నది సందీప్ వల్లే అయ్యింది. అందుకే ఆర్జీవి తో పోల్చడం జరిగింది. ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్ కి ఎలాంటి సినిమా తీస్తే కిక్ ఎక్కుతుందో.. ఎలాంటి హీరోయిజం మైండ్ బ్లాక్ చేస్తుందో అలా సందీప్ వంగ హీరో క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఇలాంటి మనుషులు ఉంటారా కాదు ఇలాంటి వాళ్లే ఉన్నారనిపించేలా అర్జున్ రెడ్డి టు యానిమల్ సినిమాలు చేశాడు సందీప్ వంగ.
స్పిరిట్ సినిమా మొదలు పెట్టడానికి ముందే..
ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా లైన్లో పెట్టాడు సందీప్ వంగ. ప్రభాస్ తో చేసే సినిమాను కూడా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తో తీసుకొస్తున్నాడని తెలుస్తుంది. స్పిరిట్ సినిమా మొదలు పెట్టడానికి ముందే సినిమాపై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఐతే ఈ సినిమాతో పాటు సందీప్ వంగ తన నెక్స్ట్ సినిమా యానిమల్ పార్క్ విశేషాలు కూడా సర్ ప్రైజింగ్ గా ఉన్నాయి. స్పిరిట్ చేసే టైం లో యానిమల్ పార్క్ ఎందుకని అనుకోవచ్చు. సందీప్ వంగ దేని ప్లానింగ్ దానికే అన్నట్టు ఉన్నాడు.
స్విచ్ ఆన్ టు యానిమల్ పార్క్.. ఎగైన్ స్విచ్ ఆన్ టు స్పిరిట్ అన్నమాట. ఐతే యానిమల్ సినిమాతో రణ్ బీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు సందీప్ వంగ. ఇండియన్ బాక్సాఫీస్ పై 900 కోట్లతో మాస్ రాంపేజ్ చూపించారు. ఐతే రణ్ బీర్ తో సందీప్ యానిమల్ సీక్వెల్ గా యానిమల్ పార్క్ అనౌన్స్ చేశాడు. ఆ సినిమా స్పిరిట్ తర్వాత ఉండే ఛాన్స్ ఉంది. యానిమల్ సినిమా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ తో పాటు యాక్షన్ సీన్స్ తో కూడా అదరగొట్టేసింది.
బాలీవుడ్ మేకర్స్ సైతం షాక్ అయ్యేలా..
బాలీవుడ్ మేకర్స్ సైతం యానిమల్ సినిమా చూసి షాక్ అయ్యేలా చేశాడు సందీప్ వంగ. స్పిరిట్ తో కూడా ప్రభాస్ మాస్ స్టామినా ఏంటో తెలుసు కాబట్టి దానికి ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండేలా చేస్తున్నాడు. ఇక యానిమల్ పార్క్ తుఫాను అయితే ఎప్పుడొచ్చినా సరే మిగతా రికార్డులు ఏవి మిగలకుండా దుమ్ము దులిపేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
స్పిరిట్, యానిమల్ పార్క్ తర్వాత సందీప్ వంగ వరుసగా విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, చరణ్ సినిమాలతో బిజీ లైనప్ తో వస్తాడని తెలుస్తుంది. ఐతే ఆ సినిమాల డీటెయిల్స్ త్వరలో తెలుస్తాయి.