అతడి నమ్మకం కథపైనా? కటౌట్ పైనా?
ఈ నేపథ్యంలో `స్పిరిట్` విషయంలో సందీప్ 2500 కోట్ల ముందొస్తు? అంచనా ఎంత వరకూ సాద్యమవుతుంది? అన్నది చూడాలి.;
రిలీజ్ కు ముందే ఏ డైరెక్టర్ తమ సినిమా ఎంత వసూళ్లు చేస్తుంది? అన్న దానిపై ఎవరూ ఓపెన్ గా మాట్లాడరు. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల ఆదరణ బట్టి వసూళ్లు ఉంటాయన్నది నమ్ముతారు. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి పాన్ ఇండియా చిత్రాలు చేసినా రాజమౌళి ఎన్నడు వసూళ్ల గురించి మాట్లాడింది లేదు. `కేజీఎఫ్`, `సలార్` లాంటి మరో రెండు సంచలన విజయాలు సాధించిన ప్రశాంత్ నీల్ నోట కూడా వసూళ్ల మాట రాలేదెప్పుడు. `పుష్ప`తో అనూహ్యా విజయం అందుకున్నప్పుడు కూడా సుకుమార్ కూడా `పుష్ప 2` వసూళ్ల విషయంలో ఎలాంటి కామెంట్ చేయలేదు.
దిగ్గజాలకే సాధ్యం కానిది:
`కాంతార`తో సంచనలం సృష్టించిన రిషబ్ శెట్టి కూడా `కాంతార చాప్టర్ వన్` వసూళ్లు గురించి మాట్లాడలేదు. ఇంకా తమిళ సహా హిందీ దర్శకుల్ని తీసుకున్నా? ఎవరూ ముందుగానే వసూళ్లను ఎలా గెస్ చేయగలం అంటారు. మాట్లాడినా అది అతే అవుతుందంటారు. ఈ విషయంలో ట్రేడ్ మాత్రమే ఓ అంచనా వేయగలదు. అదీ జరుగుతుందా? లేదా? అన్నది సినిమా ఫలితంపై ఉంటుందంటారు. కానీ తెలుగు యువ సంచలనం సందీప్ రెడ్డి వంగా మాత్రం `స్పిరిట్` వసూళ్లగు గురించి ముందే ఓ అంచనా వేసాడు. సినిమా ప్రారంభ కాకముందే..సెట్స్ కు వెళ్లకముందే తన సినిమా 2500కోట్లు వసూళ్లు సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు. మరి ఇది నమ్మకా? అతి నమ్మకమా? అన్నది రిలీజ్ తర్వాత తేలుతుంది.
సోలోగా అతడొక్కడే కానీ:
ఇప్పటి వరకూ దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం `బాహుబలి` ప్రాంచైజీ. ఆ తర్వాత `పుష్ప 2` ఉంది. `బాహుబలి` రెండు భాగాలు కలిపి 2500కోట్లకు పైగా సాధించింది. `పుష్ప `రెండు భాగాలు కలిపి 2200 కోట్ల వసూళ్లను సాధించింది. అమీర్ ఖాన్ నటించిన `దంగల్` ఒకే భాగం 2000 కోట్ల వసూళ్లను సాధిచింది. అదీ దేశీయంగా ఈ సినిమా వసూళ్లు 600 కోట్ల లోపే. మిగతా వసూళ్లన్నీ చైనా నుంచి రాబట్టినే.
సందీప్ రెండు చిత్రాలు 950 కోట్లే:
ఇక సందీప్ రెడ్డి గత సినిమాల్లోకి వెళ్తే తొలి సినిమా `అర్జున్ రెడ్డి` 50 కోట్ల వసూళ్లను సాధించింది. అటుపై రెండవ చిత్రం `యానిమల్` బాలీవుడ్ లో 900 కోట్ల వసూళ్లను సాధించింది. 1000 కోట్లు ఆ సినిమా టార్గెట్ అయినా? అది రీచ్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో `స్పిరిట్` విషయంలో సందీప్ 2500 కోట్ల ముందొస్తు? అంచనా ఎంత వరకూ సాద్యమవుతుంది? అన్నది చూడాలి. అతడి నమ్మకం కథపైనా? కటౌట్ పైనా? అన్నది రిలీజ్ తర్వాత డిసైడ్ అవుతుంది.